ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఓ కసాయి కడుపుతో(గర్భిణి) ఉన్న వీధి కుక్కను కత్తితో పలుమార్లు పొడిచి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఓ కసాయి కడుపుతో(గర్భిణి) ఉన్న వీధి కుక్కను కత్తితో పలుమార్లు పొడిచి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. "శుక్రవారం అర్ధరాత్రి ఓ కసాయి గర్భిణిగా ఉన్న వీధికుక్కను కత్తితో కొట్టి చంపాడు. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశామని స్థానికులు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ప్రాంతంలోని మాంసం దుకాణంలో పనిచేసే వ్యక్తులు.. గర్భవతి అయిన కుక్కను కత్తితో పదే పదే పొడిచి చంపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు జంతు హింస కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.