మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనపై పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం, IPC 354(A) కింద అభియోగాలు మోపారు. 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యడియూరప్పపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తల్లి, కుమార్తె యడ్యూరప్పను కలిసినప్పుడు ఫిబ్రవరి 2న ఈ సంఘటన జరిగింది. ఈ విషయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప స్పందించాల్సి ఉంది.

యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా గతంలో పనిచేశారు. 2008- 2011 మధ్య, కొంతకాలం మే 2018లో, మళ్లీ జూలై 2019 నుండి 2021 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు. యడియూరప్ప తర్వాత బీజేపీకి చెందిన బసవరాజ్ సోమప్ప బొమ్మై కర్ణాటక 23వ ముఖ్యమంత్రి అయ్యారు. బొమ్మై జూలై 2021 నుండి మే 2023 వరకు ఆ స్థానంలో పనిచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు హవేరి నియోజకవర్గం నుండి బొమ్మాయిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది.

Updated On 14 March 2024 9:51 PM GMT
Yagnik

Yagnik

Next Story