ప్రేమపేరుతో (Couple)వంచించి ఓ యువతిపై ఒకరు రేప్(Rape) చేయగా.. అతడితో ఏకాంతంగా కలిసి ఉన్న వీడియోలు(Personal Videos), ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించి మరొకరు లైంగిక దాడి(molestation) చేశాడు. ఈ ఘటన తాడిపత్రి నియోజకవర్గంలో(Thadipathri constituency) చోటు చేసుకుంది. ప్రేమపేరుతో వంచించి ఓ యువతిపై .

Engeneering Girl Molestation
ప్రేమపేరుతో (Couple)వంచించి ఓ యువతిపై ఒకరు రేప్(Rape) చేయగా.. అతడితో ఏకాంతంగా కలిసి ఉన్న వీడియోలు(Personal Videos), ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించి మరొకరు లైంగిక దాడి(molestation) చేశాడు. ఈ ఘటన తాడిపత్రి నియోజకవర్గంలో(Thadipatri constituency) చోటు చేసుకుంది. ప్రేమపేరుతో వంచించి ఓ యువతిపై . ఓ విద్యార్థిని విజయవాడలో బీటెక్(B.Tech) చదువుతోంది. ఆ విద్యార్థినికి తాడిపత్రి ప్రాంతానికే చెందిన కృష్ణారెడ్డితో(Krishna Reddy) ఐదు నెలలుగా పరిచయం ఉండేది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. బ్లేడుతో చేతిని కోసుకొని నమ్మబలికాడు. దీంతో యువతి అతడితో చనువుగా ఉండేది. అక్టోబరు 19న నిందితుడు కృష్ణారెడ్డి విజయవాడలో హాస్టల్లో ఉన్న యువతికి ఫోన్ చేసి బెంగళూరుకు(Bangalore) రావాలని లేదంటే మనిద్దరి మధ్య ఉన్న పరిచయాన్ని కుటుంబసభ్యులకు, తెలిసినవారికి చెబుతానని బెదిరించాడు. దీంతో 20న బెంగళూరుకు వెళ్లింది.
బెంగళూరులో ఉండే తన స్నేహితుడి గదికి యువతిని తీసుకెళ్లాడు. గదిలో ఎవరూ లేనప్పుడు బెదిరించి అత్యాచారం చేశాడు. ఇలా నాలుగు రోజుల పాటు అత్యాచారం చేశాడు. కృష్ణారెడ్డి నుంచి తప్పించుకుని సొంతూరుకు యువతి వెళ్లింది. తిరిగి అక్టోబరు 28న కాలేజ్‌కు వెళ్లేందుకు యువతిని గుత్తిలో డ్రాప్ చేసి తండ్రి వెళ్లిపోయాడు. అదే సమయంలో యువతి ఫోనుకు గుంతకల్లుకు చెందిన దివాకర్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెంగళూరులో కృష్ణారెడ్డితో ఏకాంతంగా కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని.. తాను చెప్పినట్లు వినకపోతే సోషల్ మీడియాలో(Socila media) పోస్ట్ చేస్తానని బెదిరించి గుంతకల్లుకు రావాలన్నాడు. భయపడిన బాధితురాలు గుంతకల్లుకు వెళ్లగా.. ఆమెను స్థానికంగా ఓ లాడ్జికి తీసుకెళ్లాడు.
పలుమార్లు బెదిరింపులకు పాల్పడుతూ రెండు రోజుల పాటు లైంగిక దాడి చేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు రహస్యంగా షూట్ చేశాడు. వాటిని మొదటి నిందితుడు కృష్ణారెడ్డి, మరికొందరికి పంపాడు. ఇలా కృష్ణారెడ్డి, దివాకర్ వాళ్లకు తెలిసిన మిత్రులందరికీ పంపించారు. ఇది తెలియని బాధితురాలు లాడ్జి నుంచి బయటపడి విజయవాడకు వెళ్లిపోయింది. ఆ ఫొటోలు, వీడియోలు అదే మండలానికి చెందిన సుదర్శన్‌రెడ్డికి చేరడంతో.. అతడు ఆ అమ్మాయి సమీప బంధువులకు తెలిపాడు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
