ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి తగ్గకపోతే దేవదాసులు అయిపోయేవారు.. మరొక దశలోప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోతే పిచ్చివాళ్ళై పోయేవారు.. ఇప్పుడు జమానా అలా లేదండోయ్! ఒకరిని ప్రేమించడం ఒకరికి నలుగురితో బ్రేకప్ అవడం పెళ్లి మాత్రం వేరొకరితో అవ్వడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది.. కానీ ప్రేమించిన అమ్మాయి విషయంలో మనస్తాపం చెందిన ఒక అబ్బాయి మాత్రం వీటికి విరుద్ధంగా తన ప్రేయసికి అనుకోని గిఫ్ట్ ఇచ్చాడు.. ప్రేమించిన యువతి చేసుకున్న భర్తను అతని కుటుంబాన్ని మొత్తాన్ని చంపేయాలనుకున్నాడు..

ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి తగ్గకపోతే దేవదాసులు అయిపోయేవారు.. మరొక దశలోప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోతే పిచ్చివాళ్ళై పోయేవారు.. ఇప్పుడు జమానా అలా లేదండోయ్! ఒకరిని ప్రేమించడం ఒకరికి నలుగురితో బ్రేకప్ అవడం పెళ్లి మాత్రం వేరొకరితో అవ్వడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది.. కానీ ప్రేమించిన అమ్మాయి విషయంలో మనస్తాపం చెందిన ఒక అబ్బాయి మాత్రం వీటికి విరుద్ధంగా తన ప్రేయసికి అనుకోని గిఫ్ట్ ఇచ్చాడు.. ప్రేమించిన యువతి చేసుకున్న భర్తను అతని కుటుంబాన్ని మొత్తాన్ని చంపేయాలనుకున్నాడు.. పెళ్లికి వెళ్లి ఒక మంచి హోమ్ థియేటర్ గిఫ్ట్ ఇచ్చాడు.. హోమ్ థియేటర్ గిఫ్ట్ ఇస్తే ఏమవుతుంది? అని అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలైన కిటుకు అసలు విషయాల్లోకి వెళ్లి పోదాం..

చత్తీస్గడ్ లోని కబీర్దాంలో హోమ్ థియేటర్ పేలి ప్రమాదం లో కొత్తగా పెళ్ళైన వరుడు తో పాటు మరికొంత మంది చనిపోయారు ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని కావాలని చేసిన పని అని తెలుసుకున్న పోలీసులు అసలు విషయాన్ని చేదించారు.. ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమె అత్తింటి వారంతటిని కూడా చంపేయాలనుకున్నాడు ఆ ప్రియుడు దానికి తగ్గట్టు ప్లాన్ వేసి హోమ్ థియేటర్లో బాంబును అమర్చి మరి గిఫ్ట్ గా ప్రియురాలికి ఇచ్చాడు ..

ఏప్రిల్ ఒకటో తేదీన హేమేంద్ర అనే యువకుడు ఒక యువతి తో ఘనంగా వివాహం జరిగింది పెళ్ళికి బోలెడు కానుకలు వచ్చాయి ఆ మరుసటి రోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గిఫ్ట్ లు ఉంచిన గదిలోకి వెళ్లడం జరిగింది. ఉన్న వాటిలో హోమ్ థియేటర్ కానుక పెద్దగా కనిపించింది హోమ్ థియేటర్ ని బయటకు తీస్తూ ఉండగా భారీ పేలుడు సంభవించి పెళ్లి కొడుకు హేమేంద్ర అక్కడే చనిపోయాడు. పేలుడు ప్రభావానికి ఆ ఇంటి గోడలు పై కప్పు సైతం కూలిపోయాయిపెళ్లి కొడుకు తమ్ముడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసాడు ఇంకా మరో నలుగురికి తీవ్ర గాయాలయి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు..

పోలీసులు రంగం లో దిగి హోమ్ థియేటర్ గిఫ్టుగా ఇచ్చిన వ్యక్తి సార్జు అనే యువకుడని అతనికి కొత్తగా పెళ్లయిన పెళ్ళికూతురికి గతంలో ప్రేమా వ్యవహారం నడిచిందని తేల్చారు మరో వ్యక్తిని వివాహం చేసుకున్న కోపంతో అతను కుటుంబాన్ని మొత్తాన్ని చంపేయాలని ప్లాన్ వేశాడా ప్రియుడు... దీంట్లో భాగంగానే గిఫ్ట్ గా ఇచ్చాడు హోమ్ థియేటర్లో ముందుగానే బాంబు ని ఫిక్స్ చేసి పెట్టాడు. ఇలా చివరకు నిండు ప్రాణాలను బలిగొన్నాడు . ప్రేయసి మీద కోపంతో చివరికి కటకటాల పాలయ్యాడు..

Updated On 5 April 2023 6:37 AM GMT
Ehatv

Ehatv

Next Story