ఆదివారం తెల్లవారుజామున విజయవాడ బస్టాండ్‌లో యాచకులు, బ్లేడ్‌ బ్యాచ్‌ కలిసి

విజయవాడ బస్టాండ్.. అక్కడ ప్రయాణీకులు వేచి ఉండడం కోసం ఉంచే చైర్లు, బెంచీలపై ఎప్పుడు చూసినా యాచకులు, బ్లేడ్ బ్యాచ్ లే ఉంటారు. సాయంత్రం-రాత్రి అయితే చాలు హాయిగా సేద తీరడానికి వస్తూ ఉంటారు. అక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్పినా వెళ్లరు. పోలీసులు కలగజేసుకున్నా అలా వెళ్లి.. ఇలా వచ్చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు వేరే చోటుకు వెళ్లిపోయి.. మళ్లీ షరా మామూలే అనేలా తిరిగి బస్టాండ్ కు చేరుకుంటూ ఉంటారు.

ఆదివారం తెల్లవారుజామున విజయవాడ బస్టాండ్‌లో యాచకులు, బ్లేడ్‌ బ్యాచ్‌ కలిసి పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దాదాపు గంటపాటు బ్లేడ్‌ బ్యాచ్‌ విజయవాడ బస్టాండ్ లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించింది. విజయవాడ బస్టాండ్‌లోని బెంచీలను బ్లేడ్‌ బ్యాచ్‌ లాక్కుంటూ ఉండడంతో విసిగిపోయిన ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారిని బస్టాండ్‌ నుంచి వెళ్లిపోయేలా చేయడానికి పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది ప్రయత్నించారు. అయితే మద్యం మత్తులో ఉన్న యాచకులు, బ్లేడ్‌ బ్యాచ్‌ పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు తెగబడ్డారు. బ్లేడ్‌ బ్యాచ్‌ దాడిలో ఆర్టీసీ ఉద్యోగి సాంబయ్య, ఆర్టీసీ ట్రాఫిక్‌ ఎస్సై వై.శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. దీంతో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. కాగా, అదనపు పోలీసు బలగాలు రావడంతో యాచకులు, బ్లేడ్‌ బ్యాచ్‌ కు చెందిన కొందరిని పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మిగిలిన కొందరు అక్కడి నుండి పారిపోయారు.

Updated On 23 March 2024 10:47 PM GMT
Yagnik

Yagnik

Next Story