బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన ఘటనలో
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు నిందితులను గుజరాత్‌లోని భుజ్‌లో ముంబై క్రైం బ్రాంచ్ సోమవారం అరెస్టు చేసింది. నిందితులను బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా మసిహికి చెందిన విక్కీ సాహబ్ గుప్తా (24), సాగర్ శ్రీజోగేంద్ర పాల్ (21)గా గుర్తించారు. ఆదివారం ముంబైలోని బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల ఘటనలో పాల్గొన్న నిందితులిద్దరినీ గుజరాత్‌లోని భుజ్ జిల్లాలో పోలీసులు కనుగొన్నారు. మంగళవారం వారిని ముంబైకి తీసుకురానున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ దగ్గరకు బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. కాల్పులు జరిగినప్పుడు సల్మాన్ ఖాన్ తన ఇంట్లోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాల్పులు జరిపిన అనంతరం నిందితులు తమ బైక్‌ను చర్చి సమీపంలో వదిలిపెట్టి కొంత దూరం నడిచి ఆటోరిక్షాలో బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఈ సంఘటనకు తామే బాధ్యులని.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించాడు.