అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేసి వేర్వేరు కేసులు నమోదు చేశారు.

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయితో పట్టుపడ్డాడని వార్తలు వస్తున్నాయి. ఇంట్లో గంజాయి తీసుకుంటుండగా.. షణ్ముఖ్‌ను పోలీసులు పట్టుకున్నారని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశారు. డ్రగ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్‌తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్‌ని మరో కేసులో అరెస్ట్ చేశారు. షణ్ముఖ్ గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు అయ్యి విడుదలైన సంగతి తెలిసిందే!!

డాక్టర్ అయిన మౌనిక అనే యువతిని తాను పెళ్లి చేసుకుంటానని షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్‌ మాట ఇచ్చాడు. అయితే మౌనికను మోసం చేసి.. మరో అమ్మాయిని సంపత్ వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంపత్‌ను ప్రశ్నించేందుకు అతడి ఫ్లాట్‌కు వెళ్లారు. అక్కడ షణ్ముఖ్ డ్రగ్ తీసుకుంటూ దొరికిపోయాడు. షణ్ముఖ్, సంపత్‌లను మౌనిక వీడియో తీస్తుండగా.. డ్రగ్స్ మత్తులో ఉన్న యూట్యూబర్ (షణ్ముఖ్ జస్వంత్) వీడియో తీయోద్దంటూ గొడవ చేశాడు. అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేసి వేర్వేరు కేసులు నమోదు చేశారు. షణ్ముఖ్‌పై డ్రగ్స్ కేసు, సంపత్‌పై చీటింగ్ కేసు పెట్టినట్లు తెలుస్తోంది.

Updated On 22 Feb 2024 1:10 AM GMT
Yagnik

Yagnik

Next Story