బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి పలు విషయాలు బయటకు వస్తున్నాయి
బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి పలు విషయాలు బయటకు వస్తున్నాయి. "Sun set to sun raise victory" పేరుతో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వాసు ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం మొదలైన పార్టీ సోమవారం ఉదయం వరకూ సాగింది. ఈ ఈవెంట్‌కు 150 మంది హాజరయ్యారని, పార్టీలో పలువురు డ్రగ్స్ అమ్మినట్టు గుర్తించామన్నారు. సోమవారం ఉదయం 3 గంటలకు గోపాల్‌రెడ్డి ఫామ్‌హౌస్‌పై రైడ్స్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికి ఐదుగురిని అరెస్ట్ చేశామని బెంగళూరు పోలీసులు చెప్పారు. నిర్వాహకుడు వాసు, అరుణ్, సిద్ధికి, రన్దీర్, రాజ్‌భవ్‌ను అరెస్ట్ చేశామని, వాసు బర్త్‌డే సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారన్నారు.
పార్టీ కి 150 మంది గుర్తుతెలియని వ్యక్తులు హాజరయ్యారని., వారందరి వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భారీ మ్యూజిక్ తో చుట్టుపక్కల ప్రజలకు చాలా ఇబ్బంది కలిగించారని కూడా పోలీసులు తెలిపారు. బెంగళూరు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో వెంటనే గోపాల్ రెడ్డి ఫార్మ్ హౌస్ పై రైడ్ చేశారు. ఈవెంట్ మొత్తానికి అరుణ్ ఇన్చార్జిగా ఉన్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చలేదని తెలిపారు. సెలెబ్రిటీలలో టాలీవుడ్ కు చెందిన సెలెబ్రిటీలు కూడా ఉన్నారని తెలుస్తోంది.