కృష్ణా జిల్లా అవనిగడ్డలో సైకో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు
కృష్ణా జిల్లా అవనిగడ్డలో సైకో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. చల్లపల్లి కోమలా నగర్ లో మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చల్లపల్లి ప్రధాన సెంటర్లలో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. నడిరోడ్డు మీద నగ్నంగా కూర్చోవడంతో అతడి దగ్గరకు వెళ్ళడానికి ప్రజలు భయపడ్డారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు శివగా గుర్తించారు.కోమల నగర్ గుడారాల వద్ద జరిగిన గొడవలో శివ గాయపడినట్లు తెలుస్తోంది. శివ మద్యం మత్తులో గాయాలతో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను హడలెత్తించాడు. శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అతడిని తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.