వరంగల్‌లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

వరంగల్‌లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డిలో మర్డర్ ప్లానింగ్ చేశారు.వరంగల్‌లో డాక్టర్ సుమంత్‌పై అటాక్‌కు ప్లాన్ చేశారు. హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ హత్యకు ఓ ఏఆర్ కానిస్టేబుల్ కూడా సహకరించినట్లు తేలింది. డాక్టర్ సుమంత్ రెడ్డితో ఫ్లోరాకి కొన్నాళ్ల క్రితం పెళ్లి జరిగింది. సంగారెడ్డిలో కొన్ని రోజుల పాటు డాక్టర్‌గా సుమంత్ రెడ్డి పనిచేశాడు. భార్య ఫ్లోరా సంగారెడ్డిలో జిమ్‌కి వెళ్తున్న సమయంలో సామెల్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలియడంతో భార్య ఫ్లోరాని డాక్టర్ సుమంత్ రెడ్డి మందలించాడు. ఈ పనిని మానుకోవాలని సూచించాడు. అయితే సుమంత్ తమ మకాంను కాజీపేటకు మార్చి అక్కడే ఓ క్లీనిక్ పెట్టుకున్నాడు. రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా ఫ్లోరా పనిచేస్తోంది. మనుషులు దూరమైన ఫ్లోరా, సామెల్ మధ్య మనసు మాత్రం దూరం కాలేదు. ఒకరి శరీరం కోసం ఒకరు పరితపించారు. ఈ నేపథ్యంలో డా.సుమంత్‌ని చంపేస్తే ఇద్దరు కలిసి ఉండవచ్చని ప్లాన్ చేసుకున్న ఫ్లోరా, సామెల్. మర్డర్ ప్లాన్ కి గచ్చిబౌలిలో పనిచేస్తున్న ఓ AR కానిస్టేబుల్ సహాయం కూడా తీసుకున్నారు. వరంగల్‌లో కారు అడ్డగించి నడి రోడ్డుపై సుమంత్‌పై ఐరన్ రాడ్లతో దాడికి తెగబడ్డారు నిందితులు. ప్రస్తుతం చావుబతుకుల్లో డాక్టర్ సుమంత్ ఉన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో భాగంగా మహారాష్ట్రలో నిందితులను పట్టుకుని వరంగల్ కి తీసుకువెళ్తున్నటు సమాచారం
