రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్(saroor nagar) అప్సర హత్య కేసులో(Apsara Murder Case) ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అప్సరకు గతంలోనే వివాహం(Marriage) అయిందనే విషయం తాగాజా వెలుగులోకి రావడంతో అందరినీ విస్తుపోయేలా చేసింది. అప్సర మొదటి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అప్సర హత్యకేసులో దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు(Primary Investigation), రిమాండ్ రిపోర్టులో అప్సర గతంలో గర్భం దాల్చినట్టు..అబార్షన్ కూడా చేయించుకున్న షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్(saroor nagar) అప్సర హత్య కేసులో(Apsara Murder Case) ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అప్సరకు గతంలోనే వివాహం(Marriage) అయిందనే విషయం తాగాజా వెలుగులోకి రావడంతో అందరినీ విస్తుపోయేలా చేసింది. అప్సర మొదటి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అప్సర హత్యకేసులో దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు(Primary Investigation), రిమాండ్ రిపోర్టులో అప్సర గతంలో గర్భం దాల్చినట్టు..అబార్షన్ కూడా చేయించుకున్న షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి. ఈ కేసును వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలని పోలీసులు దర్యాప్తు చేస్తుండగా..అప్సర మొదటి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో కేసు దర్యాప్తు మరింత క్రిటికల్‌గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ అప్సరకు ఇప్పటికే వివాహం అయిందన్న విషయం వెలుగు చూడటంతో ఆ కోణంలో కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

తాజాగా అప్సరకు వివాహమైన విషయం బయటకు రావడంతో నిందితుడు సాయికృష్ణను(Sai Krishna) కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. నెట్టింట్లో అప్సర పెళ్లి ఫొటోలు చూసిన నెటిజన్లు చిత్రవిచిత్రాలుగా కామెంట్లు పెడుతున్నారు. నిన్న మొన్నటి వరకూ సాయికృష్ణను దుమ్మెత్తి పోసిన నెటిజన్లు, ఇప్పుడు అప్సరను తిట్టిపోస్తున్నారు. అప్సరకు ఇప్పటికే వివాహమైన విషయం పెళ్లిఫొటోలు చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. అక్కడే అనేక అనుమానాలు, ప్రశ్నలు మొదలయ్యాయి. ఇంతకీ మొదటి భర్త ఏమయ్యాడు? ఆయన‌తో అప్సర విడాకులు తీసుకున్నారా..? లేకుంటే కలిసే ఉంటూ ఇలా చేశారా..? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

సన్నిహితుల సమాచారం మేరకు అప్సరకు మూడేళ్ల కిందటే చెన్నైకి చెందిన వ్యక్తితో పెళ్లయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం పోలీసుల దర్యాప్తులోనే తేలినప్పటికీ ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అప్సర మొదటి వివాహానికి సంబంధించి ఇప్పటికే కొంత సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. మొదటి భర్తతో విభేదాల కారణంగా ఏడాది కిందటే సరూర్‌నగర్‌‌లో ఉన్న తన పుట్టింటికి వచ్చేసినట్టు తెలుస్తోంది. ఆ సయమంలోనే ఇంటి దగ్గరలో ఉన్న బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా పనిచేసే సాయికృష్ణతో అప్సరకు పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త ప్రేమ, వివాహేతర సంబంధానికి దారితీసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదరిదీ ఒకే కులం కావడంతో తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై అప్సర ఒత్తిడి తెచ్చింది. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య గత కొన్నిరోజులుగా గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే అప్సరను ఎలాగైనా సరే అంతమొందించాలని గతంలో నాలుగుసార్లు ప్రయత్నించిన సాయి.. జూన్-3న పక్కా ప్లాన్‌తో ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి హత్య చేశాడు.

ఇక మొదటి నుంచి అప్సరకు నటనపై ఆసక్తి ఎక్కువని తెలిసింది. సీరియల్‌లో నటించాలని 2022లో న్నై నుంచి హైదరాబాద్ వచ్చి అప్సర ఇక్కడే స్థిరపడిందని పోలీసులు చెబుతున్నారు. అప్సర తన సోదరి దగ్గర ఉంటూనే సీరియల్ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండేది. అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన అప్సర కొద్దిరోజులు సినీ రంగంలో పనిచేసింది. అప్సర తండ్రి కాశీ ఆశ్రమంలో నివసిస్తున్నారు. సాయికృష్ణది కోనసీమ జిల్లా గన్నవరం. మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తి చేసిన సాయి.. 2010లో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా ఉంటూనే..అరుణాచల్ బిల్డర్ పేరుతో బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరికీ ఎలాంటి బంధుత్వం లేదు. ఒక్కటే కులం మాత్రమే. అప్సర బంగారు మైసమ్మ ఆలయానికి వచ్చేది. అలా అప్సరతో సాయి పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇదే వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. అయితే.. సాయికి పెళ్లయినట్లు అప్సరకు ఈ మధ్యే తెలిసింది. దీంతో.. పెళ్లి చేసుకోవాలని 2023 మార్చి నుంచి సాయిపై అప్సర ఒత్తిడి చేసింది. ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతోనే సాయి.. అప్సరను హత్య చేసేందుకు అనేకస్లారు విఫయత్నం చేసి.. చివరికి అంతమొందించాడు. తన పరువు ఎక్కడ పోతుందో అనే ఉద్దేశంతో సాయి కృష్ణ ఈ హత్య చేశాడు. హత్యను మిస్సింగ్ కేసుగా చిత్రీకరించాలని సాయి ప్లాన్ చేసి చివరికి పోలీసులకు దొరికిపోయాడు.

మొత్తానికి చూస్తే..దర్యాప్తు దాదాపు పూర్తి చేశామని పోలీసులు భవిస్తున్న సమయంలోనే అప్సరకు అప్పటికే వివాహమైందన్న విషయం బయటకొచ్చి పోలీసులే షాక్ తిన్నంత పనైంది. ఏదీ ఏమైనా ఈ పెళ్లి ఫొటోలతో పోలీసులు మరోసారి కఠిన పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్సరను హత్య చేయాలనే పాయికృష్ణ పథకం వెనుక మొదటి భర్త ప్రమేయం ఉందా?..? లేకుంటే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని సాయి ఒక్కడే అప్సరను హత్య చేశాడా..? అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సి ఉంది.

Updated On 11 Jun 2023 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story