ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారీ ఎత్తున బెట్టింగ్ జరిగిన సంగతి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారీ ఎత్తున బెట్టింగ్ జరిగిన సంగతి తెలిసిందే. వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కాసిన వ్యక్తి చివరకు డబ్బు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది.

నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయన భార్య సర్పంచ్. వీరు వైసీపీ మద్దతుదారులు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వేణుగోపాల్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కట్టారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊరు విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. బెట్టింగ్ కట్టిన వారు ఫోన్లు చేసినా స్పందన లేదు. ఈ నెల 7న పందెం వేసిన వారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పొలం వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. చింతలపూడి మండలం నామవరానికి చెందిన ఓ వ్యక్తి తన మృతికి కారణమని ఉన్న లెటర్ ను మృతదేహం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated On 9 Jun 2024 10:26 PM GMT
Yagnik

Yagnik

Next Story