పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని కలియాగంజ్‌లో ఒక మైనర్ బాలిక మృతిపై హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా కలియాగంజ్ పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించి.. పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆగ్రహంతో ఉన్న గుంపు బెంగాల్ పోలీసు సిబ్బందిని కొట్టడాన్ని వీడియోలో చూడవచ్చు.
పశ్చిమ బెంగాల్(West Bengal)లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని కలియాగంజ్(Kaliaganj)లో ఒక మైనర్ బాలిక(Minor Girl Death) మృతిపై హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా కలియాగంజ్ పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించి.. పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి. ఆగ్రహంతో ఉన్న గుంపు బెంగాల్ పోలీసు సిబ్బందిని కొట్టడాన్ని వీడియోలో చూడవచ్చు. దినాజ్‌పూర్(Dinajpur)లో రాజ్‌బొంగ్షి అనే గిరిజన బాలిక మృతిపై నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) అధికార ప్రతినిధి కునాల్ ఘోష్(Kunal Gosh) వీడియోను షేర్‌చేస్తూ.. కలియాగంజ్ లో ఇంత గూండాయిజం జరిగినా పోలీసులు కాల్పులు జరపకుండా సంయమనం పాటించారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతున్నాను. ప్రేరేపించిన వారిని కూడా పట్టుకోవాలి. అత్యాచారానికి పాల్పడినట్లు తప్పుడు వదంతులు వ్యాప్తి చేయడం, ఉద్రిక్తతలను వ్యాప్తి చేయడం.. ఇలా ఈ దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
কালিয়াগঞ্জ।
এই গুন্ডামির পরেও পুলিশ সংযত ছিল, গুলি চালায়নি।
বামফ্রন্টের পুলিশ হলে গুলিতে মৃত্যুর মিছিল হত, যেমন হয়েছিল বারবার।
হামলাকারীদের গ্রেপ্তার চাই। যারা প্ররোচনা দিয়েছে, তাদেরকেও ধরা দরকার।
ধর্ষণের মিথ্যা কথা রটানো, উত্তেজনা ছড়িয়ে এই হামলা কঠোর শাস্তিযোগ্য। pic.twitter.com/ogrww28IAG— Kunal Ghosh (@KunalGhoshAgain) April 26, 2023
మంగళవారం గిరిజన కమ్తాపురి సంస్థలు కలియాగంజ్ పోలీస్ స్టేషన్‌ను ఘెరావ్ చేశాయి. పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించడమే కాకుండా పలు పోలీసు వాహనాలను, స్టేషన్‌కు ఆనుకుని ఉన్న పోలీస్ క్వార్టర్లను తగులబెట్టారు. అంతేకాదు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు కూడా రువ్వారు.
బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ(Mamatha Benarjee) పోలీసు స్టేషన్‌పై దాడిని ఖండించారు. “దాడి ఎలా జరిగింది. పోలీసులపై దాడి చేసి ఆస్తి నష్టం జరిగిన తీరు.. ఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాం” అని మమతా బెనర్జీ అన్నారు. ఈ హింసాత్మక ఘటనకు బీజేపీయే కారణమని ఆరోపించారు. “బీజేపీ బీహార్ నుండి ప్రజలను తీసుకువచ్చి హింసను ప్రేరేపించి పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టింది. ఇది ఒక ప్రణాళిక. కేంద్రం వారి వెనుక ఉన్నందున బీజేపీ గూండాయిజం చేస్తోంది” అని ఆమె ఆరోపించారు.