అమెరికాలోని మిన్నెసోటాలో 38 ఏళ్ల మహిళ కుటుంబ తాను బస చేసిన హోటల్‌లో ఇద్దరు టీనేజ్ అబ్బాయిలతో లైంగిక చర్యలకు పాల్పడినందుకు అరెస్టు చేశారు. టీనేజర్లతో ఆ మహిళ సెక్స్ లో పాల్గొనడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 సంవత్సరాల వయస్సు ఉన్న బాలురు హాకీ టోర్నమెంట్ కోసం వచ్చినప్పుడు ఆమె వారితో మాట్లాడి లొంగదీసుకుంది. జనవరి 14న 'ఆలిసన్ లీ షార్డిన్' అనే మహిళ హోటల్ హాట్ టబ్ ప్రాంతంలో టీనేజ్ యువకులతో పరిచయం […]

అమెరికాలోని మిన్నెసోటాలో 38 ఏళ్ల మహిళ కుటుంబ తాను బస చేసిన హోటల్‌లో ఇద్దరు టీనేజ్ అబ్బాయిలతో లైంగిక చర్యలకు పాల్పడినందుకు అరెస్టు చేశారు. టీనేజర్లతో ఆ మహిళ సెక్స్ లో పాల్గొనడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 సంవత్సరాల వయస్సు ఉన్న బాలురు హాకీ టోర్నమెంట్ కోసం వచ్చినప్పుడు ఆమె వారితో మాట్లాడి లొంగదీసుకుంది.

జనవరి 14న 'ఆలిసన్ లీ షార్డిన్' అనే మహిళ హోటల్ హాట్ టబ్ ప్రాంతంలో టీనేజ్ యువకులతో పరిచయం పెంచుకుంది. ఆ సాయంత్రం తర్వాత, ఆమె స్నాప్‌చాట్ ద్వారా అబ్బాయిలలో ఒకరిని సంప్రదించింది. పలు విషయాలను వాళ్లతో చెప్పుకుంది. అంతేకాకుండా వైవాహిక సమస్యల గురించి వారితో మాట్లాడింది. తన హోటల్ గదికి రావాలంటూ వారిని కోరింది. షార్డిన్ ఇద్దరు అబ్బాయిలతో సెక్స్.. ఇతర విషయాల గురించి మాట్లాడింది. ఆ టీనేజర్లు అసౌకర్యంగా ఉన్నప్పటికీ షార్డిన్ ఇద్దరు అబ్బాయిలతో లైగింక చర్యలకు పాల్పడింది.

షార్డిన్ టీనేజర్స్ హాకీ గేమ్‌లలో ఒక మ్యాచ్ కు హాజరైంది. వారు కొలరాడోకి తిరిగి వెళ్ళిపోయాక కూడా వారిని సంప్రదించడానికి ప్రయత్నించడంతో పరిస్థితి తీవ్రమైంది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. నేరపూరిత లైంగిక ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటూ ఉందని తెలిపారు. విచారణ సమయంలో, ఆమె యువకులను ముద్దుపెట్టుకోవడం, లైంగిక చర్యల్లో పాల్గొనడం వంటి విషయాల గురించి ప్రస్తావించింది.

Updated On 4 Feb 2024 9:54 PM GMT
Yagnik

Yagnik

Next Story