మన దగ్గర ఎవరికైనా మరణశిక్ష పడితే ఉరి తీస్తారు. ఆ ఉరిశిక్షే దారుణంగా ఉంటుంది. అలాంటిది నైట్రోజన్‌ గ్యాస్‌తో(Ntrogen Gas) మనిషిని చంపేస్తే.. అది ఎంత భయంకరంగా ఉంటుందో కదా! ఇలాంటి శిక్షను అమెరికాలోని(America) అలబామాలో(alamabalo) అమలు చేయబోతున్నారు. ప్రపంచంలోనే నైట్రోజన్‌ గ్యాస్‌ను ఉపయోగించి ఓ వ్యక్తికి మరణశిక్ష అమలు చేయడం ఇదే ప్రథమం. ఎందుకీ శిక్ష? అతడు ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం 36 సంవత్సరాల వెనక్కి వెళ్లాలి.

మన దగ్గర ఎవరికైనా మరణశిక్ష పడితే ఉరి తీస్తారు. ఆ ఉరిశిక్షే దారుణంగా ఉంటుంది. అలాంటిది నైట్రోజన్‌ గ్యాస్‌తో(Ntrogen Gas) మనిషిని చంపేస్తే.. అది ఎంత భయంకరంగా ఉంటుందో కదా! ఇలాంటి శిక్షను అమెరికాలోని(America) అలబామాలో(alamabalo) అమలు చేయబోతున్నారు. ప్రపంచంలోనే నైట్రోజన్‌ గ్యాస్‌ను ఉపయోగించి ఓ వ్యక్తికి మరణశిక్ష అమలు చేయడం ఇదే ప్రథమం. ఎందుకీ శిక్ష? అతడు ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం 36 సంవత్సరాల వెనక్కి వెళ్లాలి. అది 1988వ సంవత్సరం. కోల్‌బర్ట్‌ కౌంటీలో(Colbert County) ఛార్లెస్‌ సెన్నెట్‌(Charles Sennett) అనే మతాధిపతి ఉండేవాడు. అతడి భార్య ఎలిజబెత్‌ సెన్నెట్‌.. ఈమెను చంపడానికి బిల్లీ గ్రే విలియమ్స్‌ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చాడు చార్లెస్‌.

అందుకు కారణం వేరే మహిళతో ఆయనకు వివాహేతర సంబంధం(Extra Marital affair) ఉండటం. ఆ విషయం భార్యకు తెలియడం. ఆమె నిలదీయడంతో ఎలాగైనా సరే భార్యను మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. భార్య పేరిట ఉన్న ఇన్సూరెన్స్‌ డబ్బులు(Insurance deposit) కూడా వస్తాయి కాబట్టి చంపడమే బెటరనే అనుకున్నాడు. కెన్నెత్‌ స్మిత్‌(Kenneth Smith), జాన్‌ పార్కర్‌(John Parker) అనే ఇద్దరు కాంట్రాక్ట్‌ కిల్లర్లకు వెయ్యి డాలర్ల చొప్పున ఇస్తూ ఎలిజబెత్‌ను చంపే పని అప్పగించాడు బెల్లీ గ్రే విలియమ్స్‌. ఆ ఇద్దరు కిల్లర్లు మార్చి18వ తేదీన ఇంట్లోనే ఆమెను దారుణంగా చంపేశారు(Killed). ఇది దొంగలు చేసిన పనిగా నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ చార్లెస్‌లో ఎక్కడో ఏ మూలో భయం పట్టుకుంది.

నిజం తెలిసిపోతుందేమోనన్న భయంతో తన కుటుంబసభ్యులకు నిజం చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో బిల్లీ గరే విలియమ్స్‌కు కఠిన యావజ్జీవ శిక్ష పడింది. స్మిత్‌, పార్కర్‌లకు మరణశిక్ష(death penalty) విధించింది న్యాయస్థానం. 2010 జూన్‌లో పార్కర్‌కు లెథల్‌ ఇంజెక్షన్‌ అంటే ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇచ్చి మరణశిక్ష అమలు చేశారు. 2020లో బిల్లీ గ్రే విలియమ్స్‌ అనారోగ్యంతో జైల్లోనే చనిపోయాడు. కానీ స్మిత్‌ విషయంలోనే మరణ శిక్ష జాప్యం అవుతూ వచ్చింది. 2023, నవంబర్‌ 17వ తేదీన స్మిత్‌కు లెథల్‌ ఇంజెక్షన్‌ ఇచ్చి మరణశిక్ష అమలు చేయాలని అనుకున్నారు.

కానీ ఇంజెక్షన్లు ఎక్కించేందుకు నరాలు దొరక్కపోవడంతో అధికారులు ఆ శిక్ష నిలిపేశారు ఈలోపు అలబామా సుప్రీంకోర్టు ఇచ్చిన డెత్‌ వారెంట్‌ గడువు ముగిసిపోయింది. దాంతో అతని మరణశిక్ష అమలుపై సమీక్ష జరపాలని అలబామా గవర్నర్‌ కెయ్‌ ఇవెయ్‌ ఆదేశించారు. సమీక్షానంతరం నైట్రోజన్‌ హైపోక్సియా పద్ధతితో శిక్ష అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఇలాంటి మరణశిక్షలపై ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు ఉన్నాయి. మొదటిసారి స్మిత్‌కు లెథల్ ఇంజెక్షన్‌ ఇచ్చినప్పుడే అతడి మానసికస్థితి దెబ్బతిన్నదని ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తూ వచ్చారు. ఇలాంటి శిక్షను అమలు చేయడానికి వీలులేదంటూ క్షమాభిక్ష కోరారు స్మిత్‌ కుటుంబసభ్యులు.

ప్రపంచ వ్యాప్తంగా మానవహక్కుల సంఘాలతో పాటు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘ కార్యాలయం కూడా ఈ శిక్షను నిలిపివేయాలంటూ కోరుతూ వస్తోంది. ఎలిజబెత్‌ కుటుంబసభ్యులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మరణ శిక్ష అమలు చేయాల్సిందనని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.
ఈలోపు అమెరికా రాజ్యాంగంలోని ఎనిమిదో సవరణ ప్రకారం మరణ శిక్షను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు స్మిత్‌ తరపు న్యాయవాదులు. కానీ అమెరికా సుప్రీం కోర్టు(America supreme court) ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ముగ్గురు మాత్రమే స్మిత్‌ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నారు. మిగతా మెజారిటీ న్యాయమూర్తులు పిటిషన్‌ను తిరస్కరించారు.
నైట్రోజన్‌ హైపోక్సియా భయానకంగా ఉంటుంది. నైట్రోజన్‌ సిలిండర్‌కు బిగించిన పైప్‌ను మాస్క్‌ ద్వారా నిందితుడి ముక్కుకు బిగిస్తారు. గ్యాస్‌ను విడుదల చేయగానే సదరు వ్యక్తి గిలగిల కొట్టుకుంటూ చనిపోతారు.

Updated On 25 Jan 2024 5:38 AM GMT
Ehatv

Ehatv

Next Story