America Oklahoma city crime: మహిళను చంపి ఆమె గుండెను పీకి .. ఇంట్లో వాళ్ళకి కూర వండి తినిపించాడు. !
44 ఏళ్ల లారెన్స్ పాల్ ఆండర్సన్ 2021లో ఈ భయంకరమైన హత్యలకు పాల్పడ్డాడు.లారెన్స్ పాల్ అండర్సన్ 2017లో డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్టయ్యాడు. న్యాయస్థానం అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓక్లహోమా పర్డోన్ అండ్ పేరోల్ బోర్డ్ సిఫార్సు మేరకు గవర్నర్ కెవిన్ స్టిట్..
అతను మనిషి కాదు రాక్షసుడు భయకరమైన ఉన్మాది.. ఇప్పటికీ పలు కేసుల్లో పలుసార్లు జైలుకు వెళ్లొచ్చాడు.. అయినా అతని లో కించెత్తు మార్పు కూడా రాలేదు.. ఈసారి అతను చేసిన దారుణానికి అందరూ భయపడిపోయారు. అతి భయంకరంగా క్రూరంగా చేసిన హత్యలకు అక్కడున్న వారందరూ కూడా నివ్వెర పోయారు. కంటి మీద కునుకు లేకుండా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని గడిపారు .
44 ఏళ్ల లారెన్స్ పాల్ ఆండర్సన్ 2021లో ఈ భయంకరమైన హత్యలకు పాల్పడ్డాడు.లారెన్స్ పాల్ అండర్సన్ 2017లో డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్టయ్యాడు. న్యాయస్థానం అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓక్లహోమా పర్డోన్ అండ్ పేరోల్ బోర్డ్ సిఫార్సు మేరకు గవర్నర్ కెవిన్ స్టిట్.. అతడి శిక్షను తొమ్మిదేళ్లకు కుదించారు. అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్న లారెన్స్ జనవరి నెలలో పెరోల్ మీద బయటకు వచ్చాడు. జైలు నుంచి విడుదలైన కొన్ని వారాల తర్వాత తన అత్తయ్య , మామయ్య ల దగ్గరకు వచ్చి వారితోనే ఉంటున్నాడు .
లారెన్స్ కి ఉన్నటుండి ఏమైందో తెలియదు తన పక్క ఇంట్లో ఉంటున్న మహిళను అతి దారుణం గా కిరాతకం గా హత్య చేసాడు . హత్య చేసిన తరువాత ఆమె గుండెను పీకి ఇంటికి తెచ్చాడు . ఇంట్లో వాళ్ళ కోసం డిన్నర్ నేనే తయారు చేస్తాను అని చెప్పిన లారెన్స్ మహిళా గుండె ని బంగాళాదుంపలతో కలిపి కూరగా వండి సిద్ధం చేసాడు . ఈ వంటను తన ఇంట్లో వాళ్ళైనా అత్తడెస్లీ పై ,మామ లియోపై ఇంకా వాళ్ళ మనుమరాలు నాలుగేళ్ళ పాపకు కూడా తినిపించాడు. ఆతరువాత ఆ ముగ్గురిపై దాడి చేసి కత్తితో అతి దారుణం గా పొడిచి చంపాడు . ఆ దాడి లో లారెన్స్ మామ ,నాలుగేళ్లపాప చనిపోయారు .
అత్త డెస్లీ పై తీవ్రంగా గాయపడింది. దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా మొత్తం ముగ్గురు వ్యక్తులను కిరాతకంగా చంపేశాడు.పోలీసులకు అసలువిషయం తెలిసింది . చుట్టూ పక్కల వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా గడిపారు కొన్నాళ్ళు . లారెన్స్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులకు నేరం అతనే చేసినట్లు ఒప్పుకున్నాడు . ఎందుకు కుటుంబ సభ్యులను చంపావు అని అడుగగా మాత్రం రకరకాల సమాదానాలు బదులు చెప్పాడు . మాదకద్రవ్యాల కేసులో 20 సంవత్సరాల శిక్షను కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అనుభవించాడు. పొరపాటున పెరోల్ జాబితాలో ఉంచబడ్డాడని దర్యాప్తులో తెలిసినాక తలలు పట్టుకున్నారు అక్కడి పోలీసులు . లారెన్స్ పాల్ అండర్సన్ గతంలో నేర చరిత్ర ఉంది. అతడి మానసిక పరస్థితి సరిగ్గా లేదని పోలీసులు చెప్పటం జరిగింది. పోలీస్ లు నిర్లక్ష్యం వహించినందుకు అతని అత్త ఇతరకుటుంబ సభ్యులు ఓక్లహోమా గవర్నర్, జైలు పెరోల్ బోర్డుపై కేసులు పెట్టడం జరిగింది. .