ఏలూరులో మహిళపై యాసిడ్ దాడి జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని ఇద్దరు యువకులు మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు.

Acid attack on woman in Eluru
ఏలూరు(Eluru)లో మహిళపై యాసిడ్ దాడి(Acid Attack) జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి(Govt Hospital)కి తరలించగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం విజయవాడ(Vijayawada) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని ఇద్దరు యువకులు మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. బాధిత మహిళ భర్తకు దూరంగా ఉంటూ డెంటల్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టు(Receptionist)గా పనిచేస్తుంది. సమాచారం అందుకున్న ఏలూరు రేంజ్ డీఐజీ(Eluru Range DIG), జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి(SP Mary Prashanthi) ఘటనా స్థలానికి చేరుకుని స్వయంగా వివరాలు సేకరిస్తున్నారు. నిందితుల కోసం జిల్లా ఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఏలూరు డీఎస్పీ శ్రీనివాస్(DSP Srinivas) పర్యవేక్షణలో నగరంలోని సీఐలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
