బాపట్ల జిల్లా రేపల్లె అరవపల్లి శివారు క్రైస్తవ స్మశాన వాటికలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. పాత కక్షలు నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణ.. హత్యకు దారితీసింది.

A young man was brutally murdered in Repalle
బాపట్ల జిల్లా(Bapatla District) రేపల్లె(Repalle) అరవపల్లి(Arasavilli) శివారు క్రైస్తవ స్మశాన వాటికలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. పాత కక్షలు నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణ.. హత్య(Murder)కు దారితీసింది. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఓ యువకుడిని మరో యువకుడు విచక్షణారహితంగా పొడిచి చంపాడు. మృతి చెందిన యువకుడిని 24 వార్డు నివాసి మేక సాయి(Meka Sai) (24) గా గుర్తించారు. హత్యకు పాల్పడిన వ్యక్తి పట్టణంలోని జగనన్న కాలనీలో నివాసముంటున్న బ్లేడ్ హర్ష(Blade Harsha)గా పోలీసులు కనుగొన్నారు. మృతుడు సాయి నగరం(Sai Nagaram)లోని ఎస్వీఆర్ఎం కళాశాల(SVRM College)లో డిగ్రీ ఫైనల్ ఇయర్(Degree Final Year) చదువుతున్నాడు. హత్యకు పాల్పడిన వ్యక్తి విజయవాడలో నగర బహిష్కరణకు గురైన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది.
