మిర్జాపూర్ దేహత్ కొత్వాలి ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న రైతు దంపతులపై శుక్రవారం ఉదయం కుక్క దాడి చేసింది. ముందుగా భార్యను కింద పడేసిన కున్న ఆ తర్వాత ఆమె ముఖం, మెడపై బ‌లంగా దాడిచేసింది. దీంతో ఆ మహిళ మృతి చెందింది.

మిర్జాపూర్(Mirzapur) దేహత్ కొత్వాలి ప్రాంతంలో వ్యవసాయం(Farming) చేస్తున్న రైతు దంపతులపై శుక్రవారం ఉదయం కుక్క(Dog) దాడి చేసింది. ముందుగా భార్యను కింద పడేసిన కున్న ఆ తర్వాత ఆమె ముఖం, మెడపై బ‌లంగా దాడిచేసింది. దీంతో ఆ మహిళ(Woman) మృతి చెందింది. భార్య‌ను రక్షించడానికి భర్త రాగా.. కుక్క అతడి ఎడమతో సహా పలు చోట్ల కరిచింది. దీంతో ప‌క్క‌నేఉన్న స్థానికులు కుక్కను చుట్టుముట్టి చంపేశారు. కచ్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరైని బరీపూర్‌లో నివాసం ఉంటున్న బసంతు బింద్ (58), అతని భార్య దులేసర దేవి (55) భటౌలీ గంగా నది స‌మీపంలో కూరగాయలు(Vegitables) పండిస్తారు. శుక్రవారం ఇద్దరూ పొలంలో పని చేస్తున్న స‌మ‌యంలో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.

ఉదయం 10 గంటలకు దులేసరాపై కుక్క దాడి చేసింది. తప్పించుకునే ప్రయత్నంలో ఆమె ఇసుకలో పడింది. కుక్క దులేసారా ముఖం, మెడపై చాలా చోట్ల గ‌ట్టిగా దాడి చేసింది. దులేసర అరుపులు విని బసంతు పరిగెత్తుకుంటూ వచ్చి ర‌క్షించ‌బోగా అతనిపై కూడా కున్న‌ దాడి చేసింది. ఎడమ చేతి వేలితో సహా పలుచోట్ల అత‌డిని కాటు వేసింది. వారిని రక్షించేందుకు మరికొందరు కూడా రావడంతో కుక్క వారిని కరిచి గాయపరిచింది. కున్న దాడిలో దులేసార దేవి మరణించింది. అడ్డుకునేందుకు వచ్చిన కేవత్వీర్‌కు చెందిన శివలాల్ (32), హీరావతి (64) కూడా కుక్క కాటుకు గురయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇంతలో కుక్కల దాడితో మహిళ మృతి చెందిన విషయం సమీప గ్రామస్తులకు తెలిసింది. ఆగ్రహించిన గ్రామస్థులు కర్రలతో కుక్కను చుట్టుముట్టి కొట్టి చంపారు. కుక్కల దాడితో మృతి చెందిన దులేసార దేవికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లయింది. పొలాల్లో పని చేస్తున్న తల్లిదండ్రులపై కుక్క దాడి చేసిందని మృతురాలి కుమారుడు రాంలాఖాన్ అలియాస్ ఝల్లు తెలిపాడు.

Updated On 5 Jan 2024 10:30 PM GMT
Yagnik

Yagnik

Next Story