.పట్టపగలు రోడ్ల పైన మహిళలు స్వేచ్చగా తిరగలేని దుస్థితి నెలకొంది . ఒంటరిగా నిల్చున్న బిక్కు బిక్కు మంటునే ఉండాల్సిన దౌర్బాగ్యం నెలకొంది.

బీహార్‌లో ఓ యువకుడు ఓ మహిళపై సైకో లా ప్రవర్తించాడు . అతని ప్రవర్తనకు అందరు ఆశ్చర్యపోయారు . అనుకోని సంఘటనతో షాక్ కు గురైన ఆ మహిళ తేరుకొని అరుపులు పెట్టేసరికి ఆ ఆగంతకుడు కాస్తా పరారయ్యాడు . ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం .

దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ..మహిళలకు మాత్రం ఇంకా స్వాతంత్రం రాలేదని చెప్పడానికి నిత్యం ఎన్నో సంఘటనలు మనం చూస్తునే ఉన్నాం.. ఇలాంటి సంఘటనే బీహర్ లో జరిగింది . .పట్టపగలు రోడ్ల పైన మహిళలు స్వేచ్చగా తిరగలేని దుస్థితి నెలకొంది . ఒంటరిగా నిల్చున్న బిక్కు బిక్కు మంటునే ఉండాల్సిన దౌర్బాగ్యం నెలకొంది. ఎటునుంచి ఎవరు వచ్చి దాడి చేస్తారో ...ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉన్నారు మహిళలు ..

బీహార్‌లో పోకిరి వెదవలు కొందరు మహిళల్ని భయాబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటి వరకు రోడ్డు పక్కన, బస్టాండ్‌లో నిల్చున్న మహిళలో మెడల్లో నగలు, గొలుసులు లాక్కెళ్లే వాళ్లను చూశాం. యాసిడ్ దాడులు చూసాం ..అటాక్ లు చూసాం ...కాని జాముయి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. ఆసుపత్రిలో పని చేస్తున్న హెల్త్ వర్కర్‌ నిల్చొని ఉండగా సడెన్ గా అక్కడికి వచ్చిన ఓ యువకుడు ..ఆమెను గట్టిగా పట్టుకొని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. సదరు బాధితురాలు ప్రతిఘటిస్తున్నప్పటికి విడిచిపెట్టకుండా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆమె అరుస్తుండగానే ...వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రి గోడ దూకి పారిపోయాడు. ఈదృశ్యం అక్కడే అమర్చిన సీసీ కెమెరాలో రికార్డైంది.

నాల్గో శ్రేణి ఉద్యోగినిగా పని చేస్తున్న బాధితురాలు తనపై జరిగిన అకస్మాత్తు చర్యకు షాకైంది. అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికి దొరకకపోవడంతో వెంటనే నగరంలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు పారిపోతున్న ఫోటోలను పోలీసులకు చూపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రి ఆవరణలో రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు మంచాల యువకుడని ఇంకా పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. ఈ కేసులో మహిళ ఉద్యోగిని పబ్లిక్‌ ప్లేసులో ముద్దుపెట్టుకున్న నిందితుడ్ని గుర్తించామని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్‌డిపి తెలిపారు. ఈ దుర్మార్గపు చర్యతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉండే మహిళా ఉద్యోగులు, హెల్త్ వర్కర్లు, పేషెంట్‌లు ఆసుపత్రి ప్రాంగణంలో నిల్చోవాలంటే భయపడిపోతున్నారు.

Updated On 14 March 2023 2:29 AM GMT
Ehatv

Ehatv

Next Story