Suicide Bombing : బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆత్మాహుతి దాడి.. 52 మంది మృతి
నైరుతి పాకిస్థాన్‌లోని(Pakistan) బలూచిస్థాన్(Balochistan) ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన అనుమానాస్పద ఆత్మాహుతి పేలుడులో(Suicide Bonbing) 52 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 50 మంది గాయపడినట్లు స్థానిక మీడియా నివేదించింది.
నైరుతి పాకిస్థాన్‌లోని(Pakistan) బలూచిస్థాన్(Balochistan) ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన అనుమానాస్పద ఆత్మాహుతి పేలుడులో(Suicide Bonbing) 52 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 50 మంది గాయపడినట్లు స్థానిక మీడియా నివేదించింది. మృతుల్లో ఓ పోలీసు(Police) అధికారి కూడా ఉన్నట్లు సమాచారం.
మహ్మద్(Muhammad) ప్రవక్త జన్మదిన వేడుకలను జరుపుకునేందుకు భక్తులు బలూచిస్థాన్‌లోని మస్తుంగ్ జిల్లాలోని మసీదు సమీపంలో సమావేశమవగా.. ఆ ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈద్ మిలాదున్ నబీ వేడుకలకు సంబంధించి ఊరేగింపు జరుగుతుండగా.. పేలుడు సంభవించిందని పాక్ మీడియా సంస్థ డాన్ తన నివేదికలో పేర్కొంది.
మరణించిన వారిలో మస్తుంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) నవాజ్ గష్కోరి(Nawaz Gashkori) కూడా ఉన్నారని స్థానిక పోలీసులు డాన్‌కి తెలిపారు. అనుమానిత ఆత్మాహుతి బాంబర్ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి కారులో ఉండగానే తనను తాను కాల్చుకున్నాడు.పేలుడు ఘటన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు నేపథ్యంలో ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు కరాచీ పోలీసులు ట్విట్టర్‌లో ప్రకటించారు.
ముస్తాంగ్‌లో పేలుడు నేపథ్యంలో పూర్తి హై అలర్ట్‌తో ఉండాలని అదనపు ఐజి కరాచీ ఖాదీమ్ హుస్సేన్ రాండ్.. కరాచీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈద్ మిలాద్-ఉన్-నబీ, శుక్రవారం ప్రార్థనలకు సంబంధించి నగరంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు కఠినమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయని ఉర్దూలో ఒక ట్వీట్‌లో పేర్కొంది.