డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లా కేంద్రంలోని కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో తేలు కుట్టి విద్యార్థి మృతి చెందాడు. కోరుమిల్లి గ్రామానికి చెందిన ప్రసాద్, శ్రీదేవి దంపతుల చిన్న కుమారుడు

A student died after being stung by a scorpion in the classroom
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా(Konaseema district)లో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లా కేంద్రంలోని కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో తేలు కుట్టి విద్యార్థి మృతి చెందాడు. కోరుమిల్లి గ్రామానికి చెందిన ప్రసాద్, శ్రీదేవి దంపతుల చిన్న కుమారుడు అభిలాష్(14) వాకతిప్ప ప్రభుత్వ పాఠశాల(Govt School)లో 9వ తరగతి చదువుతున్నాడు. గురువారం తరగతి గదిలో చిక్కిల రేపర్లు ఎక్కువగా ఉండడంతో మరో విద్యార్థితో కలిసి శుభ్రం చేస్తున్న అబిలాష్ ఎడమ చేతి వేలుకు తేలు(Scorpion) కుట్టింది.
ఉపాధ్యాయులు వెంటనే అబిలాష్(Abhilash) ను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స చేయించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్(Kakinada GGH) కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఊపిరితిత్తుల(Lungs)లోకి విషం చేరి.. రక్తపు వాంతులు(Blood Vomitings) అయ్యి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. కేసు నమోదు చేసినట్లు అంగర ఎస్సై జి చంటి(Chanti) తెలియజేశారు.
