శంషాబాద్(Shamshabad) పరిధిలో ఓ పూజారి(Priest) మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మహిళతో వివాహేతర సంబంధం(Extra Marital affair) పెట్టుకున్న పూజారి.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో దారుణంగా హత్య చేశాడు. ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న పూజారి.. మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు.
శంషాబాద్(Shamshabad) పరిధిలో ఓ పూజారి(Priest) మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మహిళతో వివాహేతర సంబంధం(Extra Marital affair) పెట్టుకున్న పూజారి.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో దారుణంగా హత్య చేశాడు. ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న పూజారి.. మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. సరూర్ నగర్(saroornagar) నుంచి మహిళను కారులో ఎక్కించుకొని వచ్చిన పూజారి.. శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోది హత్య చేశాడు. అనంతరం మహిళ మృతదేహాన్ని కవర్ లో కట్టి.. కారులో తీసుకెళ్లి సరూర్‌నగర్ లోనే మ్యాన్ హోల్ లో పడేశాడు. ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు బయటపెట్టారు పోలీసులు. మూడు రోజుల క్రితం పూజారి మహిళను హత్య చేశాడు. నిందితుడు వెంకట సాయి సూర్య కృష్ణ కాగా, మృతురాలిని అప్సరగా గుర్తించారు పోలీసులు.