హర్యానా లోని గురుగ్రామ్ లో ఓ ఇద్దరు యువకులు కారులోంచి రోడ్డు మీద కరెన్సీ నోట్లు విసిరివేసారు పైగా ..దీన్ని విడియో తీసి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ విడియో వైరల్ గా మారింది.
కారులోంచి ఓ వ్యక్తి కరెన్సీ నోట్లను వెదజల్లాడు.. కరెన్సీ నోట్లను వెదజల్లుతున్న తీసుకున్న విడియోను ఇన్ స్టా లో పోస్ట్ చేసాడు .. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ ఇది ఎక్కడ ? దీనికి సంబంధించిని ఏంటో చూద్దాం.
హర్యానా లోని గురుగ్రామ్ లో ఓ ఇద్దరు యువకులు కారులోంచి రోడ్డు మీద కరెన్సీ నోట్లు విసిరివేసారు పైగా ..దీన్ని విడియో తీసి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ విడియో వైరల్ గా మారింది. ఈ నోట్లలో ఎక్కువగా 500 , 2000 నోట్లు ఉన్నాయి.. అయితే ఇవి నిజమైన నోట్లు అనుకుంటే పొరపడ్డట్లే ....ఫేక్ కరెన్సీ నోట్లను రోడ్డు మీద పడేసారు ..ఇన్ స్టా లో రీల్స్ కోసం చేసిన ఈ విడియో బాగానే వైరల్ అయ్యింది...చివరికి పోలీసుల కంట పడింది. దీంతో ట్రాక్ చేసి ఆ ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఇద్దరు ఢిల్లీకి చెందిన జోరావర్ సింగ్ , గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు పోలీసులు .వీరిద్దపై కేసు నమోదు చేసారు పోలీసులు... దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇలాంటి సంఘటన ఇది మొదటిసారి ఏమి కాదు . ఇంతకు ముందు ఈ ఏడాది జనవరిలో బెంగళూర్‌లోని కేఆర్ పురం ఫ్లైఓవర్ నుంచి ఓ వ్యక్తి కింద ఉన్న ప్రజలపై గుర్తుతెలియని వ్యక్తి రూ. 10 నోట్లను విసిరిన వీడియో వైరల్ అయింది. దీంతో అటు ఫ్లైఓవర్‌తో పాటు కిందనున్న రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు గుజరాత్‌లోని మెహసనలో తన మేనల్లుడి పెండ్లి సందర్భంగా మాజీ సర్పంచ్ తన ఇంటి పై అంతస్దు నుంచి నోట్ల కట్టలను ప్రజలపై విసిరివేయడం దుమారం రేపింది.