గాలిపటం ఎగరవేయాలన్న సరదా మరో బాలుడి ప్రాణం తీసింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో నాలుగు చోట్ల నలుగురు వ్యక్తులు గాలిపటాల కారణంగా మృతి చెందగా..
గాలిపటం ఎగరవేయాలన్న సరదా మరో బాలుడి ప్రాణం తీసింది. ఇప్పటికే హైదరాబాద్(Hyderabad) నగరంలో నాలుగు చోట్ల నలుగురు వ్యక్తులు గాలిపటాల(Kite) కారణంగా మృతి చెందగా.. ఇప్పుడు మరో బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్(Vikarabad) జిల్లాలోని బషీరాబాద్(Basheerabad) లో చోటుచేసుకుంది. భోగి పండుగ సందర్భంగా తొమ్మిదేళ్ల బాలుడు అబూజర్ గాలిపటాలు ఎగరవేస్తున్న సమయంలో ఒక గాలిపటం తెగిపోయింది. అయితే తెగిన గాలిపటాన్ని తీసుకునేందుకు బాలుడు రైల్వే ట్రాక్ పైకి వెళ్ళాడు. అదే సమయంలో అటుగా వస్తున్న బెంగళూరు-నాందేడ్ ఎక్స్ప్రెస్ ట్రైన్(Bengaluru-Nanded Express Train) బాలుడిని ఢీ కొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు. హృదయ విదారకమైన ఆ ఘటనను చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు. తండ్రి అస్లాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.