భార్య రూపవతీ శత్రుః అని మన పెద్దలు ఊరికే అనలేదు. అందమైన భార్య ఉండటాన్ని కూడా కొందరు భర్తలు భరించలేరు.

భార్య రూపవతీ శత్రుః అని మన పెద్దలు ఊరికే అనలేదు. అందమైన భార్య ఉండటాన్ని కూడా కొందరు భర్తలు భరించలేరు. భార్య అందంగా ఉంటే బోల్డన్నీ అనుమానాలు పెట్టుకుంటారు. కర్నాటక(Karnataka)లోని రామనగర జిల్లా(Ramanagar District)మాగడి(magadi)కి చెందిన ఒకడు అందంగా తయారవుతుందని చెప్పి భార్యను చంపేశాడు. 32 ఏళ్ల దివ్య(Divya), ఉమేశ్‌ (Umesh)భార్యభర్తలు. ఆమెకు అందంగా కనిపించాలనే కోరిక ఉండేది. అందుకే లిప్‌స్టిక్‌ వేసుకునేది. ఓ టాటూ కూడా వేయించుకున్నదట! ఇవి ఆమె మొగుడుకు నచ్చలేదు. రోజూ ఆమెతో గొడవపడేవాడు. అనుమానపడేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజుల కిందట మాగడి ఫ్యామిల కోర్టులో దివ్య విడాకుల పిటిషన్‌ కూడా వేసింది. మంగళవారం ఇద్దరూ విచారణకు హాజరయ్యారు. ఇక నుంచి చక్కగా చూసుకుంటానని, ఏ మాత్రం అనుమానించనని దివ్యను ఉమేశ్‌ నమ్మించాడు. పాపం భర్త మారిపోయాడని అనుకుందామె! అతడితో కలిసి స్థానిక ఊజగల్లు(Ujagallu)ఆలయానికి వెళ్లింది. ఆమెను చంపేయాలని ముందే అనుకున్న ఉమేశ్‌ దర్శనం తర్వాత అక్కడ కొండ దగ్గరకు దివ్యను తీసుకెళ్లాడు. అక్కడ నలుగురు స్నేహితులతో కలిసి దివ్యను హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేశాడు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ఉమేశ్‌, మరొకరికి కోసం వెతుకుతున్నారు.

ehatv

ehatv

Next Story