హైదరాబాద్‌లోని ఖైరతాబాద్(Khairathabad) మింట్ కాంపౌండ్(Mint Compound) లో తుపాకీ మిస్ ఫైర్ అవడంతో కానిస్టేబుల్(Constable) మృతిచెందాడు. మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్(Printing Press) లో సెక్యూరిటీగా ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామయ్య.. తుపాకీని శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్(Miss fire) అయినట్లు అధికారులు తెలిపారు. తీవ్ర గాయాలైన రామయ్యను అధికారులు కేర్ ఆసుపత్రిలో(Care Hospital) చేర్చారు.

Breaking News
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్(Khairatabad) మింట్ కాంపౌండ్(Mint Compound) లో తుపాకీ మిస్ ఫైర్ అవడంతో కానిస్టేబుల్(Constable) మృతిచెందాడు. మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్(Printing Press) లో సెక్యూరిటీగా ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామయ్య.. తుపాకీని శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్(Miss fire) అయినట్లు అధికారులు తెలిపారు. తీవ్ర గాయాలైన రామయ్యను అధికారులు కేర్ ఆసుపత్రిలో(Care Hospital) చేర్చారు. అయితే అప్పటికే రామయ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో రామయ్య సుమారు నాలుగున్నర సంవత్సరాలుగా సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. రామయ్య వయసు 49 సంవత్సరాలు. ప్రస్తుతం రామంతాపూర్ లో నివాసం ఉంటున్న రామయ్య స్వస్థలం మంచిర్యాల. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
