జంట నగరాల్లో ఉదయం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ కళాసిగూడలో శనివారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి అయ్యింది. సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండడంతో చిన్నారి మౌనిక డ్రైనేజీలో పడిపోయింది.
జంట నగరాల్లో ఉదయం భారీ వర్షం(Heavy Rain) కురిసింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా సికింద్రాబాద్(Secundrabad) కళాసిగూడ(Kalasiguda)లో శనివారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి అయ్యింది. సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్‌హోల్(Manhole) మూత తెరిచి ఉండడంతో చిన్నారి మౌనిక(Mounika) డ్రైనేజీలో పడిపోయింది. విషయం తెలిసిన డీఆర్‌ఎఫ్(DRF) సిబ్బంది చిన్నారి కోసం గాలించగా.. పార్క్ లైన్(Park lane) వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు. ఈరోజు ఉదయం చిన్నారి పాల ప్యాకెట్(Milk Packet) కోసం బయటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాల కోసం వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చివరకు మ్యాన్‌హోల్‌లో పడి పాప మృతి చెందిన విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన చిన్నారి మౌనిక 4వ తరగతి చదువుతోంది. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.