పంజాబ్‌లోని లూథియానాలోని ఓ కర్మాగారంలో ఆదివారం జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 11 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన గియాస్‌పురా ప్రాంతంలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గ్యాస్ లీకేజీకి కారణమేమిటో తెలియరాలేదు. రెస్క్యూ ఆపరేషన్ నిమిత్తం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.

9 dead, 11 taken ill after gas leak in Ludhiana factory
పంజాబ్‌లో(Punjab)ని లూథియానా(Ludhiana)లోని ఓ కర్మాగారం(Factory)లో ఆదివారం జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 11 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన గియాస్‌పురా(Giaspura) ప్రాంతంలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గ్యాస్ లీకేజీ(Gas Leakage)కి కారణమేమిటో తెలియరాలేదు. రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) నిమిత్తం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
ఖచ్చితంగా.. ఇది గ్యాస్ లీక్ కేసు. ప్రజలను ఖాళీ చేయించడానికి ఎన్‌డిఆర్‌ఎఫ్(NDRF) బృందం సంఘటనా స్థలంలో ఉంది. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. 11 మంది అస్వస్థతకు గురయ్యారని లుథియానా వెస్ట్ ఎస్డీఎమ్ స్వాతి(Swathi) ఏఎన్ఐతో చెప్పారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అగ్నిమాపక అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్యులు, అంబులెన్స్‌ల బృందాన్ని కూడా పిలిచినట్లు పోలీసులు తెలిపారు.
ట్విటర్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Bhagwant Mann) ఘటనపై స్పందించారు. ఎంతో విచారకరం. సహాయకచర్యలు జరుగుతున్నాయని తెలిపారు. "లూథియానాలోని గియాస్‌పురా ప్రాంతంలోని ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఘటన చాలా బాధాకరం. పోలీసులు, అడ్మినిస్ట్రేషన్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ట్వీట్ చేశారు.
