కేరళలోని(Kerala) త్రిసూర్(Trissur) జిల్లాలో మొబైల్ ఫోన్ పేలి ఎనిమిది ఏళ్ళ చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది .ఈ రోజుల్లో పిల్లలు మాటవినాలంటే మొబైల్ చేతిలో పెట్టాల్సిందే . ఫోన్ వాళ్ళ చేతికిచ్చేసి మనం పనుల్లో మునిగిపోతుంటాం .గంటల తరబడి ఫోన్ ప్రపంచంలో మునిగిపోతుంటారు పిల్లలు . ఇలా గంటల తరబడి ఇంటర్నెట్ వాడటం వల్ల ,వీడియోస్ చూస్తుండటం వల్ల మొబైల్ (mobile)బ్యాటరీ వేడి ఎక్కుతుంది .దాంతో అనుకోని ప్రమాదాలు జరిగి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి .

కేరళలోని(kerala) త్రిసూర్ (Trissur)జిల్లాలో స్థానిక పంచాయతి బోర్డు సభ్యుడు అరుణ్ కుమార్(Aruna kumar) కూతురు 8 ఏళ్ల ఆదిత్య శ్రీ(Aditya Sri)మూడవ తరగతి చదువుతుంది . వేసవి సెలవులు కావటంతో రోజు మొబైల్ లో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేసేది . సోమవారం రాత్రి ఇంట్లోవాళ్లు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా మొబైల్ ఫోన్ లో వీడియో చూస్తుండగా, ఒక్కసారిగా పాపా చేతిలో ఫోన్ భారీ శబ్దంతో పేలింది .సోమవారం రాత్రి 10. 30ని లకు ఈ ఘటన జరిగింది .మొబైల్ చేతిలో ఉండటంతో భారీ పేలుడుకు పాపా ముఖం ,చెయ్యి ,పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యి అక్కడిక్కడే మృతి చెందింది .ఆ సమయంలో పాపాతో పాటు తన నాన్నమ్మ మాత్రమే ఇంట్లో ఉన్నారు . భారీశబ్దం రావటంతో చుట్టుపక్కలవాళ్లు ఘటన స్థలానికి వచ్చి పాపను హుటాహుటిన ఆసుపత్రి కి తరలించారు .

ఇటీవల మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది . 68 ఏళ్ళ వ్యక్తి ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతూ మొబైల్ చేతిలో పేలి అక్కడిక్కడే మృతి చెండాడు . మొబైల్ బాటరీలో లిథియం ఉంటుంది .మొబైల్ లో ఎక్కువసేపు అలానే చూస్తుండం వల్ల మొబైల్ హీట్ ఎక్కుతుంది . ఎక్కువగా ఇంటర్నెట్ చూస్తున్నపుడు ,ఛార్జింగ్ ఎక్కువసేపు పెట్టి వదిలేసినపుడు ,బ్యాటరీ ఛార్జ్ లో ఉండగా ఎక్కువసేపు గేమ్స్ అలాంటివి ఆడటం జరిగినపుడు బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది . బ్యాటరీ వీపరీతంగా వేడి ఎక్కుతుంది .ఇలాంటి సందర్భాల్లో పేలుడు తీవ్ర స్థాయిలో సంభవిస్తుంది . కాబట్టి పిల్లల చేతికి మొబైల్ ఇచ్చేటప్పుడు ఇకనైన జాగ్రత్తలు వహించటం మర్చిపోవద్దు .

Updated On 27 April 2023 1:47 AM GMT
rj sanju

rj sanju

Next Story