కొన్ని రోజుల కిందట మెక్సికోలో మానవ శరీరభాగాల అవశేషాలతో కూడిన ప్లాస్లిక్ బ్యాగులు దొరికాయి కదా! పాపం ఆ అవశేషాలు కాల్‌సెంటర్ ఉద్యోగులవి అట! కాల్‌సెంటర్‌లో ఉద్యోగం మానేయడానికి సిద్ధమైన ఎనిమిది మంది యువతీ యువకులను చంపేసి ప్లాస్టిక్ బ్యాగుల్లో కుక్కారట!ఈ దారుణానికి ఒడిగట్టింది జలిసోకు అనే ముఠా. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న మెక్సిన్‌లోని ఓ డ్రగ్ కార్టెల్‌లో ఈ దారుణ ఘటన జరిగింది.
కొన్ని రోజుల కిందట మెక్సికోలో మానవ శరీరభాగాల అవశేషాలతో కూడిన ప్లాస్లిక్ బ్యాగులు దొరికాయి కదా! పాపం ఆ అవశేషాలు కాల్‌సెంటర్ ఉద్యోగులవి అట! కాల్‌సెంటర్‌లో ఉద్యోగం మానేయడానికి సిద్ధమైన ఎనిమిది మంది యువతీ యువకులను చంపేసి ప్లాస్టిక్ బ్యాగుల్లో కుక్కారట!ఈ దారుణానికి ఒడిగట్టింది జలిసోకు అనే ముఠా. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న మెక్సిన్‌లోని ఓ డ్రగ్ కార్టెల్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ విషయాన్ని అమెరికా, మెక్సికో అధికారులు ధ్రువీకరించారు.
అసలేం జరిగిదంటే.. మెక్సికోలోని గువాడలజరా సమీపంలో జలిసో న్యూ జనరేషన్ కార్టెల్ ఆధ్వర్యంలో ఓ కాల్‌సెంటర్ నడుస్తోంది. అందులో పని చేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులు హఠాత్తుగా కనిపించకుండా పోయారు. వారిలో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు. దీంతో వారి కుటుంబసభ్యులో పోలీసులకు కంప్లయింట్ చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. వారికి ఆ ప్రాంతంలో శరీరభాగాలతో కూడిన కొన్ని ప్లాస్టిక్ కవర్లు దొరికాయి. ఆ అవశేషాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా అవన్నీ తప్పిపోయిన ఆ కాల్ సెంటర్ ఉద్యోగులవేనని తేలింది. మెక్సికోలో అత్యంత హింసాత్మక గ్యాంగ్‌గా జలిసోకు పేరుంది. ఈ కొత్త తరం ముఠా సాధారణ కార్యకలాపాలు కాకుండా డ్రగ్స్ అక్రమ రవాణా, దోపిడి, కిడ్నాప్‌ల వంటి చట్ట వ్యతిరేక పనులు చేస్తుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరిట అమెరికన్లు, కెనడియన్లు లక్ష్యంగా మోసాలకు పాల్పడుతుంటుంది. అది కూడా ఈ కాల్‌సెంటర్ ద్వారానేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందులో పని చేసే యువతీ యువకులను ఎవరు ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలియదు కానీ, వారంతా ఉద్యోగం మానేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ఈ దారుణానికి తెగబడినారట!