తమిళనాడులో రైలు ప్రమాదం వెలుగు చూసింది. మదురై స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు కోచ్‌లో మంటలు చెలరేగాయి. లక్నో నుండి రామేశ్వరం వెళ్తున్న రైలు ప్యాసింజర్ కోచ్‌లో మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది మరణించారు.

తమిళనాడు(Tamilnadu)లో రైలు ప్రమాదం(Train Accident) వెలుగు చూసింది. మదురై స్టేషన్‌(Madhurai Station)లో ఆగి ఉన్న రైలు కోచ్‌లో మంటలు చెలరేగాయి. లక్నో(Lucknow) నుండి రామేశ్వరం(Rameshwaram) వెళ్తున్న రైలు ప్యాసింజర్ కోచ్‌(Train Passenger Coach)లో మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది మరణించారు. ఈ ప్ర‌మాదంలో 20 మంది గాయపడ్డారని దక్షిణ రైల్వే వర్గాలు(South Railway) తెలిపాయి. రైల్వే శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం.. ఈరోజు ఉదయం 5.15 గంటలకు మదురై యార్డ్ వద్ద పునలూర్-మధురై ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ కోచ్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేయడంతో మిగతా బోగీలకు ఎలాంటి నష్టం జరగలేదు.

రైలులో మంటలు చెలరేగినట్లు దక్షిణ రైల్వే వెల్లడించింది. గ్యాస్ సిలిండర్‌(Gas Cylinder)ను ప్రయాణికులు రహస్యంగా తీసుకెళ్లడం వల్లే మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రైవేట్ పార్టీ కోచ్‌లోని ప్రయాణికులు గ్యాస్ సిలిండర్లను అక్రమంగా తరలిస్తున్నారని.. దీంతో మంటలు చెలరేగాయని రైల్వే తెలిపింది. కోచ్‌లో మంటలు చాలా తీవ్రంగా చెల‌రేగాయ‌ని.. అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడి మంట‌ల‌ను ఆర్పివేశారని అధికారులు తెలిపారు.

Updated On 25 Aug 2023 10:27 PM GMT
Yagnik

Yagnik

Next Story