అమృత్‌సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్యను జమ్మూ డీసీ సవరించారు.
జమ్మూ : అమృత్‌సర్(Amritsar) నుంచి కత్రా(Katra) వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం(Accident)లో మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్యను జమ్మూ డీసీ సవరించారు. మొదట మృతుల సంఖ్య పదిమంది అని వార్త బయటకు రాగా.. ప్రమాదంలో ఏడుగురు మరణించారని ధృవీకరించారు.
అమృత్‌సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు లోయలో పడిపోయిందని జమ్మూ డీసీ తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి(Govt Medical College Hospital)కి తరలించారు. గాయపడిన మరో 12 మంది స్థానిక పిహెచ్‌సి(PHC)లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
పంజాబ్(Punjab)లోని అమృత్‌సర్ నుండి శ్రీ మాతా వైష్ణో దేవి(Sri Vyshno Matha Devi) కట్టాకు వెళ్తున్న భక్తుల బస్సు ఝజ్జర్ కోట్లి(Jhajjar Kotli) ప్రాంతంలోని వంతెనపై నుండి లోయలో పడిపోయింది. వంతెన నుండి కందకం దాదాపు 50 అడుగుల లోతులో ఉంటుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారని జమ్ముకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి అవనీ లావాసా తెలిపారు.