మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో శనివారం తెల్ల‌వారుజామున‌ రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. పిటిఐ కథనం ప్రకారం.. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మహారాష్ట్రలో(Maharashtra)ని బుల్దానా(Buldhana) జిల్లాలో శనివారం తెల్ల‌వారుజామున‌ రెండు ప్రైవేట్ బస్సులు(Privaite) ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. పిటిఐ(PTI) కథనం ప్రకారం.. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మల్కాపూర్(Malkapur) పట్టణంలోని ఫ్లై ఓవర్‌పై తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సుల్లో ఒకటి అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra) అనంతరం హింగోలికి వెళ్తుండగా.. మరో ప్రైవేట్ బస్సు నాసిక్(Nashik) వైపు వెళ్తోంది.

నాసిక్ వెళ్తున్న బస్సు ట్రక్కును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించి ఎదురుగా వ‌స్తున్న బ‌స్సును ఢీకొట్టింది. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు బస్సుల‌ను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌(Traffic)ను పునరుద్ధరించారు. బుల్దానా జిల్లాలో ఇటీవల జరిగిన రెండో అతిపెద్ద బస్సు ప్రమాదం ఇది.

బుల్దానా ప్రమాద ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ డాక్టర్ హెచ్. తుమ్మోద్(Dr. H. Tummod) మాట్లాడుతూ.. బుల్దానాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెంద‌గా.. ఒకరు ఆసుపత్రిలో చ‌నిపోయిన‌ట్లు తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోందని వెల్ల‌డించారు.

Updated On 29 July 2023 12:08 AM GMT
Yagnik

Yagnik

Next Story