ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని షాజహాన్‌పూర్(Shahjahanpur)లో వంతెనపై నుంచి ట్రాక్టర్-ట్రాలీ(Tractor-Trolley) పడిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు.

6 killed, 10 injured after tractor-trolley falls off bridge in UP’s Shahjahanpur
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని షాజహాన్‌పూర్(Shahjahanpur)లో వంతెనపై నుంచి ట్రాక్టర్-ట్రాలీ(Tractor-Trolley) పడిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు రక్షించి సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. తిల్హర్‌లోని బిర్‌సింగ్‌పూర్ గ్రామంలో వంతెనపై నుంచి గర్రా నది(Garra River)లో ట్రాక్టర్ ట్రాలీ పడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
थाना क्षेत्र तिलहर में पुल से ट्रैक्टर ट्राली गिरने की दुर्घटना के सम्बन्ध में एस0 आनन्द वरिष्ठ पुलिसअधीक्षक #shahjahanpurpol की बाइट। #UPPolice @Uppolice @112UttarPradesh @UPGovt @homeupgov @uptrafficpolice pic.twitter.com/SEXB9B1nYs
— SHAHJAHANPUR POLICE (@shahjahanpurpol) April 15, 2023
ఆదివారం నుంచి తిల్హార్ ప్రాంతంలోని సునౌరా అజ్మత్‌పూర్ గ్రామంలో భగవత్ కథ నిర్వహించనున్నారు. అంతకుముందు కలష్ యాత్రను చేయాల్సి ఉంటుంది, అందుకోసం రెండు ట్రాక్టర్ ట్రాలీలలో కూర్చున్న మహిళలు, పురుషులు బిర్సింగ్‌పూర్ ప్రాంతంలోని గర్రా నదికి బయలుదేరారు. వంతెన వద్దకు చేరుకోగానే అతివేగంతో ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి రెయిలింగ్ విరిగి నదిలో పడింది. రెండో ట్రాలీలో ఉన్న గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న వారి సహాయంతో అందరినీ బయటకు తీశారు. అందరినీ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
