ఉత్తరప్రదేశ్‌లోని కకోరి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఒక విషాద సంఘటన
ఉత్తరప్రదేశ్‌లోని కకోరి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఒక విషాద సంఘటన జరిగింది. ఫలితంగా ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. రాత్రి 10.30 గంటల సమయంలో కకోరిలోని హతా హజ్రత్ సాహెబ్ కస్బాలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎల్‌పీజీ సిలిండర్లు పేలాయి. మృతులను ముషీర్ (50), హుస్న్ బానో (45), రాయ (7), ఉమా (4), హీనా (2)గా గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారని, వారిలో నలుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని లక్నో పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తదుపరి విచారణ జరుగుతోంది.
పేలుడు చాలా బలంగా వినిపించిందని స్థానికులు తెలిపారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు, గోడలు కూలిపోయాయి. చుట్టుపక్కల ప్రజలు కూడా భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. మరణించిన వారిలో 50 ఏళ్ల జర్దోజీ కళాకారుడు ముషీర్, అతడి భార్య హుస్నా బానో, ఏడేళ్ల మేనకోడలు రైయా, బావ అజ్మత్ కుమార్తెలు నాలుగేళ్ల హుమా, రెండేళ్ల హీనా ఉన్నారు.