వైఎస్‌ఆర్ కడప(YSR Kadapa) జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. వివరాళ్లోకెళితే.. ఎర్రగుంట్ల(Erraguntla) మండలం పోట్లదుర్తి శివారులో ఆర్టీసీ బస్సు(RTC Bus), ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.

Kadapa Road accident
వైఎస్‌ఆర్ కడప(YSR Kadapa) జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. వివరాళ్లోకెళితే.. ఎర్రగుంట్ల(Erraguntla) మండలం పోట్లదుర్తి శివారులో ఆర్టీసీ బస్సు(RTC Bus), ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. పులివెందుల డిపోకు చెందిన బస్సు.. శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులను మహమ్మద్(25), హసీనా(25) అమీనా(20) షాకీర్(10)గా గుర్తించారు. మృతులు కడప జిల్లాలో ఆజాద్‌నగర్‌కు చెందినవారుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
