ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణం కొన‌సాగుతుంది. గంగోత్రి హైవేను అర్థరాత్రి మూసివేయడంతో ప్రయాణికుల వాహనాలు గంగ్నాని సమీపంలో నిలిచిపోయాయి. ఒక్కసారిగా కొండచరియలు విరిగి టెంపో ట్రావెల్స్ సహా మూడు వాహనాలపై పడ్డాయి. దీంతో మూడు వాహనాలు శిథిలాలలో కూరుకుపోయాయి.

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ప్రతికూల వాతావరణం కొన‌సాగుతుంది. గంగోత్రి హైవే(Gangotri National Highway)ను అర్థరాత్రి మూసివేయడంతో ప్రయాణికుల వాహనాలు గంగ్నాని సమీపంలో నిలిచిపోయాయి. ఒక్కసారిగా కొండచరియలు విరిగి టెంపో ట్రావెల్స్ సహా మూడు వాహనాలపై పడ్డాయి. దీంతో మూడు వాహనాలు శిథిలాలలో కూరుకుపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో ఓ మహిళ సహా నలుగురు చనిపోయారు. ప్రయాణికులంద‌రూ మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)కు చెందిన వారుగా చెబుతున్నారు. గాయపడిన ఏడుగురు ఆసుపత్రికి త‌ర‌లించారు.

మంగళవారం ఉదయం హైవే తెరవడంతో ఎస్డీఆర్ఎఫ్‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. గంగోత్రి హైవేపై భట్వాడి-గంగ్నాని మధ్య 20 కిలోమీటర్ల పరిధిలో ఏడు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని బీఆర్‌ఓ అధికారి మేజర్ వీఎస్ వీణు(Veenu) తెలిపారు. ఈ ఘటనలో టెంపో ట్రావెలర్(Tempo Traveller), టవేరా(Tavera), స్విఫ్ట్ డిజైర్(Swift Dezire) శిథిలాల కింద చిక్కుకుపోయాయని భట్వాడీ ఎస్‌డిఎం చత్తర్ సింగ్ చౌహాన్(Chatter Singh Chauhan) తెలిపారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది. ఏడుగురిలో ఇద్దరు తీవ్రంగా గాయ‌ప‌డ‌గా, ఐదుగురు మైనర్లు స్వ‌ల్పంగా గాయడ్డారు. శిథిలాల నుంచి వాహనాలను త్వరగా బయటకు తీసేందుకు ఎస్డీఆర్ఎఫ్‌(SDRF) బృందం కృషి చేస్తున్నారు.

యమునోత్రి ధామ్‌(Yamunotri Dham)తో సహా యమునా లోయలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది(Yamuna) యొక్క ఉపనదులు, కాలువలు ఉప్పొంగుతున్నాయి. దీంతో ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది. మరోవైపు గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించింది.

Updated On 10 July 2023 11:26 PM GMT
Yagnik

Yagnik

Next Story