హర్యానా(Haryana)లోని కర్నాల్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. కర్నాల్(Karnal)లో రైస్‌మిల్లు(Rice Mill) 3వ అంతస్తు కుప్పకూలింది. రైస్‌మిల్లు కూలడంతో నలుగురు కూలీలు మృతి చెందారు. రైస్‌మిల్ భవనం కూలిపోవడంతో చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది.
హర్యానా(Haryana)లోని కర్నాల్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. కర్నాల్(Karnal)లో రైస్‌మిల్లు(Rice Mill) 3వ అంతస్తు కుప్పకూలింది. రైస్‌మిల్లు కూలడంతో నలుగురు కూలీలు మృతి చెందారు. రైస్‌మిల్ భవనం కూలిపోవడంతో చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. కూలిన మిల్లు శిథిలాల కింద పలువురు కార్మికులు సమాధి అయ్యి ఉండవచ్చని భావిస్తున్నారు. రైస్ మిల్లు కార్మికులు శిథిలాల కింద సమాధి అయ్యిండొచ్చని భయాందోళన చెందుతున్నారు. అగ్నిమాపక దళం, పోలీసులు, అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. జేసీబీ ద్వారా భవన శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
తారావాడి(Tarawadi Karnal) వద్ద గల శివశక్తి రైస్ మిల్లు(Shiva Shakti Rice Mill) 3వ అంతస్తు భవనం తెల్లవారుజామున 3:30 గంటలకు ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కూలిపోవడంతో 20 మందికి పైగా కూలీలు శిథిలాలలో చిక్కుకోగా.. నలుగురు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కార్మికులను కల్పనా చావ్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం కారణంగా తోటి కూలీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మూడంతస్తుల భవనంలో మొత్తం 157 మంది కూలీలు నివసిస్తున్నారని తెలుస్తోంది. భవనం కూలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసు యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. డీసీ అనీష్ యాదవ్(Aneesh Yadav), ఎస్పీ శశాంక్ సావన్(Shashank Sawan) కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 24 మంది గాయపడ్డారని, నలుగురు మరణించారని ఎస్పీ శశాంక్ సావన్ తెలిపారు. ఘటన జరిగిన సమయంలో భవనంలో దాదాపు 150 మంది ఉద్యోగులు ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. భవనంలో కొన్ని లోపాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఘటనపై విచారణకు కమిటీ వేయనున్నాం. రైస్‌మిల్లు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.