31 ఏళ్ల వివాహిత.. 21 ఏళ్ల యువకుడు..!!
విశాఖ జిల్లా పద్మానాభపురం మండలంలోని కృష్ణాపురంలో ఓ వివాహేతర సంబంధం చివరికి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది. 31 ఏళ్ల వివాహిత, 21 ఏళ్ల పెళ్లికాని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలోని కృష్ణాపురానికి చెందిన కనకల లక్ష్మి తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అదే గ్రామానికి చెందిన మొకర ఆదిత్య స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ వెనుక ఉన్న షెడ్లో చీరతో ఉరివేసుకొని మృతిచెందాడు. వీరి మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం ఉంది. ఆదిత్య తండ్రి రవి, మృతురాలి భర్త శంకర్ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. వివాహితకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో తేజేష్ 4వ తరగతి, ధను 2వ తరగతి చదువుతున్నారు. లక్ష్మి మృతితో ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. తల్లి మృతదేహం వద్ద ఉన్న చిన్నారులను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ఆదిత్య కూడా తల్లిదండ్రులకు ఒకే ఒక్క కుమారుడు. విశాఖలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎదిగివచ్చిన కొడుకును కోల్పోయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.