గిరిజన యువతిని అపహరించి మూడు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జల్దేగాలోని క్వార్టర్‌లో ఆమెను ఉంచి మూడు రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి
గిరిజన యువతిని అపహరించి మూడు రోజుల పాటు సామూహిక అత్యాచారం(Gang Rape) చేసిన ఘటన సంచలనం రేపింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జల్దేగా(Jaldega)లోని క్వార్టర్‌లో ఆమెను ఉంచి మూడు రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అరెస్టయిన నిందితుల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డ్రస్సర్ ఉన్నాడు. బాధితురాలు బానో పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసి. ఆమె శనివారం జలదేగా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చింది. సోమవారం బంజోగాలోని వీక్లీ మార్కెట్‌ను సందర్శించేందుకు వెళ్లింది. తిరిగి వస్తుండగా సూరజ్ నాయక్(Suraj Naik) బాలికను తన ఆటోలో కూర్చోబెట్టి మభ్యపెట్టి పటియాంబ పంచాయతీలోని బస్తితోలికి తీసుకెళ్లాడు. ఇక్కడ నిందితుడు సూరజ్ నాయక్, అతని మరో సహచరుడు విక్కీ నాయక్(Vicky Naik)తో కలిసి గ్రామంలోని ఖాళీ ఇంట్లో యువతిపై అత్యాచారం చేశాడు.
మరుసటి రోజు ఉదయం సూరజ్, విక్కీ జల్దేగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డ్రస్సర్‌గా పనిచేస్తున్న నీల్కమల్ సింగ్(Nil Kamal Singh)కు యువతి గురించి తెలియజేశారు. నీల్కమల్ యువతిని మెడికల్ క్వార్టర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ నీల్కమల్ మరొకరికి(సుమిత్ లుగున్) యువతి విషయం తెలిపాడు. మంగళవారం, బుధవారం వరకు నలుగురు నిందితులు.. మెడికల్ క్వార్టర్‌లో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గురువారం ఉదయం బాలికను విలియం చౌక్ సమీపంలో వదిలి పారిపోయారు.
ఆ తర్వాత బాధిత యువతి జల్దేగా పోలీస్ స్టేషన్ గేట్ సమీపంలోని హోటల్ వద్ద దీన స్థితిలో కూర్చుంది. ఇంతలో నిందితుడు సుమిత్ లుగున్(Sumit Lagun) బైక్‌పై హోటల్ లో ఏదో కొనేందుకు వచ్చాడు. నిందితుడు సుమిత్ లుగున్‌ను చూసిన యువతి అరవడం ప్రారంభించింది. నన్ను రేప్ చేశారు అంటూ.. ఏడుస్తూ అరిచింది. ఇది విన్న సుమిత్ బైక్ వదిలి పారిపోయాడు. చుట్టూ జనం గుమిగూడారు. స్థానికులు యువతితో పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఘటనపై సమాచారం అందించారు.
ఎస్‌ఐలు బీరేందర్ శర్మ(Birendra Sharma), ధీరజ్ ఒరాన్‌ల ఎదుట యువతి తన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. పోలీసులు యువతిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి.. వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.