నవ మాసాలు మోసి కని బిడ్డను ఎంతో అపురూపంగా తీర్చిద్దితుంది సృష్టిలో ప్రతి తల్లి పాత్ర అది. పిల్లలు ఆలనా పాలనా మంచి చెడు ఎలా ప్రతి విషయంలో భాద్యత ను తీసుకొని వారి భవిష్యతుని తీర్చి దిద్దుతుంది. సమాజంలో తోటి వారితో ఎలా నడుచు కోవాలో నేర్పిస్తుంది. మాట విననపుడు కాస్త కఠినంగా ప్రవర్తించిన బిడ్డ బాగుండాలని వారి కోసం అహర్నిశలు తాపత్రయపడేది తల్లి. అలాంటి తల్లి ని కన్న కూతురే హత్య చేసింది .వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవం. వయసులో ఉన్న కూతుర్ని తన స్నేహితుడు తో దూరంగా ఉండమని మందలించింది.

నవ మాసాలు మోసి కని బిడ్డను ఎంతో అపురూపంగా తీర్చిద్దితుంది సృష్టిలో ప్రతి తల్లి పాత్ర. పిల్లలు ఆలనా పాలనా మంచి చెడు ఎలా ప్రతి విషయంలో భాద్యత ను తీసుకొని వారి భవిష్యత్తుని తీర్చి దిద్దుతుంది. సమాజంలో తోటి వారితో ఎలా నడుచు కోవాలో నేర్పిస్తుంది. మాట విననపుడు కాస్త కఠినంగా ప్రవర్తించిన బిడ్డ బాగుండాలని వారి కోసం అహర్నిశలు తాపత్రయపడేది తల్లి. అలాంటి తల్లి ని కన్న కూతురే హత్య చేసింది .వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవం. వయసులో ఉన్న కూతుర్ని తన స్నేహితుడు తో దూరంగా ఉండమని మందలించింది. తన ప్రేమకు తన తల్లి పోరు అడ్డుగా భావించిన 16 ఏళ్ళ బాలిక తన కన్నతల్లిని అతి దారుణంగా చంపింది .

ఈ ఉదంతం రష్యా(Russia) రాజధాని మాస్కో(Moscow)లోని ఓ నగరంలో చోటుచేసుకుంది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం . భర్తకు దూరమైనా ఒక మహిళా తన 16 ఏళ్ళ కూతురితో మాస్కో నగరంలో అద్దెకు నివాసం ఉంటుంది . కూతురి ప్రవర్తనలో మార్పు గమించిన తల్లీకూతురిని గమనించటం మొదలుపెట్టింది .రోజు ఎవరో కుర్రాడితో తిరగటం ,ఇంటి దగ్గర అతను వదిలి వెళ్లడం గమనించింది .
ఎవరు అని ఆరాతీయగా అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది .దానితో కూతుర్ని అతనికి దూరంగా మందలించింది .మాట వినని కూతురు తన ప్రేమకు తల్లిని అడ్డుగా భావించింది .తన అడ్డుని తొలగించుకోవాటినికి బాయ్ ఫ్రెండ్ తో కలిపి పథకం వేసింది . మరో ఇద్దరు కిరాయి హంతకులతో తల్లిని హత్య చేయించింది. తన కళ్ళముందే తల్లి అతి దారుణంగా చంపబడుతున్న చూస్తూ ఉంది తప్ప తప్పు చేస్తున్నాను అన్న భావనే లేదు .

హత్య తరువాత మృతదేహాన్ని ప్లాస్టిక్‌ కవర్లో చుట్టి బెడ్‌ లోపల పెట్టి చెత్తకుప్పలో పడేశారు. ఓ వ్యక్తి చెత్తకుప్ప వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.దాంతో పోలీసులు రంగం లో దిగారు .అసలు విషయాన్నీ తెలుసుకొని బాలికను అరెస్ట్ చేసి మొత్తం కథను తెలుసుకున్నారు . హత్య కు ముందే తన స్నేహితుడిని ఇంటికి పిలిపించి కిరాయి హంతకులతో గొంతు నులిమి చంపించింది .హత్యా లో పాల్గొన్న వాళ్ళందరూ 14 నుండి 17 ఏళ్ళ లోపు వయసువారు కావటం బాధాకరం . చనిపోయిన మహిళా చాలామంచిదని ఆమె ఎప్పుడు తన కూతురి మంచి కోసం ఆలోచించేది అని బాలిక స్నేహితురాలు పోలీస్ వాంగ్మూలం లో తెలిచేయటం అందర్నీ కన్నీరు పెట్టెల చేసింది .

Updated On 6 April 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story