కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని హోసూర్‌లోని అతిపల్లి ప్రాంతంలోని ఓ బాణసంచా దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందారు.

13 charred to death, seven injured in explosion at firecracker godown at Attibele-Hosur border
కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని హోసూర్‌లోని అతిపల్లి ప్రాంతంలోని ఓ బాణసంచా దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. వివరాళ్లోకెళితే..కర్నాటక రాష్ట్రంలోని అత్తిపల్లి ప్రాంతంలో నవీన్ అనే వ్యక్తి పటాకుల దుకాణం నడుపుతున్నాడు. బాణసంచా దుకాణానికి కంటైనర్ వాహనం నుండి బాణసంచా బాక్సులను లోడ్ చేస్తుండగా.. అనుకోకుండా పటాకులు పేలాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో 16 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని.. గాయపడిన వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే అప్పటికే బాణాసంచా దుకాణం మొత్తం కాలిబూడిదైంది.
