మెక్సికోలో(Mexico) దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కాన్వాయ్‌పై(Police Convoy) గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు(Shoot Out) జరిపారు. ఈ సంఘటనలో 12 మంది పోలీసులతో పాటు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. గురెరోలోని(Guerrero) కోయుక డీ బెనిటేజ్(Coyuca de Benitez) న‌గ‌రంలో సోమ‌వారం ఈ ఘోరం జరిగింది.

మెక్సికోలో(Mexico) దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కాన్వాయ్‌పై(Police Convoy) గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు(Shoot Out) జరిపారు. ఈ సంఘటనలో 12 మంది పోలీసులతో పాటు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. గురెరోలోని(Guerrero) కోయుక డీ బెనిటేజ్(Coyuca de Benitez) న‌గ‌రంలో సోమ‌వారం ఈ ఘోరం జరిగింది. దాడి జరిగిన సమయంలో జాతీయ భద్రతా విభాగానికి చెందిన సీనియర్‌ అధికారి ప్రయాణిస్తున్నారు. ఆయనను టార్గెట్‌గా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో స‌ద‌రు అధికారితోపాటు, మొత్తం 16 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు చెప్పారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాల్పుల‌కు గ‌ల కార‌ణాల‌పై విచారిస్తున్నారు. దాడి చేసిన వారిని డ్ర‌గ్ స‌రాఫ‌రా చేసే ముఠాగా అనుమానిస్తున్న‌ట్లు తెలిపారు.

Updated On 24 Oct 2023 12:38 AM GMT
Ehatv

Ehatv

Next Story