ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదంజరిగింది. గంజాం జిల్లాలో రాత్రి రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందగా, ఆరుగురు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం(Odisha Accident) జరిగింది. గంజాం(Ganjam) జిల్లాలో రాత్రి రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందగా, ఆరుగురు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్(Odisha CM Naveen Patnaik) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బెర్హంపూర్‌లో మినీ బస్సు(Mini Bus), ఓఎస్ఆర్టీసీ(OSRTC) బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని గంజాం జిల్లా దిగండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఓఎస్‌ఆర్‌టీసీ బస్సు రాయగడ(Rayagada) నుంచి భువనేశ్వర్(Bhubaneswar)కు వెళ్తున్నట్లు సమాచారం. మరోవైపు, పాతాపూర్ పోలీసు పరిధిలోని ఖండదేయులి గ్రామానికి చెందిన ఒక కుటుంబం బెర్హంపూర్‌లోని అత్తమామల వద్ద వధువును డ్రాప్ చేయడానికి వెళ్లింది. కార్యక్రమం ముగించుకుని అందరూ మినీ బస్సులో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఇంతలో ఎదురుగా వస్తున్న ఓఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొంది. దీంతో మినీ బస్సు బోల్తా పడింది. క్షతగాత్రులను బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ(MKCG) ఆస్పత్రికి తరలించారు. ఓఎస్‌ఆర్‌టీసీ బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున 1 గంటలకు ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. గంజాం డీఎం దిబ్యా జ్యోతి పరిదా(Dibya Jyoti Parida) మరణాలను ధృవీకరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్లు, నలుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. అయితే ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. కేసుకు సంబంధించి సవివరమైన నివేదిక అందాల్సి ఉంది.
దిగ్పహండి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పలువురు ప్రయాణికులను రక్షించారని బెర్హంపూర్ ఎస్పీ తెలిపారు. ప్రమాదం వెనుక అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు. మా విచారణ కొనసాగుతోంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం రూ.30 వేల చొప్పున ఒడిశా ప్రభుత్వం(Odisha Govt) ప్రకటించింది.