గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై ఇద్దరు యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

11 Year Old Girl Was Gang Raped By Two Youths In Mangalagiri Of Guntur In Ap
గుంటూరు(Guntur) జిల్లా మంగళగిరి(Mangalagiri)లో దారుణం చోటుచేసుకుంది. బాలిక(Girl)పై ఇద్దరు యువకులు(Two Youth) పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు(Parents) ఇంట్లో లేనప్పుడు బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల(Police)కు చెబితే చంపుతామని నిందితులు బెదిరింపులకు పాల్పడటంతో.. బాధిత బాలిక, ఆమె కుటుంబసభ్యులు భయపడి విషయం ఎవరికీ చెప్పలేదు. దీంతో తల్లిదండ్రులు పనికి వెళ్లాక మరోసారి ఇద్దరు యువకులు బాలికపై అత్యాచారం(Rape) చేశారు. ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు(Complaint) చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైద్యం పరీక్షల నిమిత్తం మైనర్ బాలిక(Minor Girl)ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
