ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి జిల్లాలో బుధవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బొలెరో వాహనం ట్రక్కును ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిన్నారి సహా పలువురు గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు.

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని ధామ్‌తరి(Dhamtari) జిల్లాలో బుధవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం(Road Accident) జ‌రిగింది. బొలెరో వాహనం ట్రక్కును ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిన్నారి సహా పలువురు గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. జగత్రా(Jagatra) సమీపంలోని కంకేర్ జాతీయ రహదారి(Kanker National Highway)పై ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాదానికి గురైన కుటుంబం సొరం(Soram) నుండి మర్కటోలా(Markatola)కు వెళుతుండగా ఈ ఘోర ప్ర‌మాదం సంభవించింది.

బలోద్(Balod) ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్(Jitendra Kumar Yadav) మాట్లాడుతూ.. బలోద్ జిల్లాలోని జగత్రా సమీపంలో ట్రక్కు, కారు ఢీకొనడంతో 10 మంది మృతి చెందగా, ఒక చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించినట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్(Bhupesh Baghel) ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన క్ష‌త‌గాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పురూర్ పోలీసులు(Purur police) సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Updated On 3 May 2023 10:06 PM GMT
Yagnik

Yagnik

Next Story