ఛాయ్‌లు(Tea) అమ్ముకుంటే ఎంతొస్తుందండి..
ఛాయ్‌లు(Tea) అమ్ముకుంటే ఎంతొస్తుందండి.. మహా అయితే ఓ 20 వేలు వస్తాయేమో! లక్కు బాగుంటే ఇంకో పది వేలు వస్తాయంతే! నెలకు లక్ష రూపాయలకుపైగా సంపాదించడం అంత వీజీ అయిన పని కాదు. కానీ పుణెలో(Pune) ఓ అమ్మాయి ఈజీగా లక్షకు పైగా సంపాదించేస్తోంది. ఆమె పేరు సిమ్రన్ గుప్తా. మోడల్‌లో(Model) తయారయ్యే ఈ భామ తాను చేసే రుచికరమైన టీతో పాటు తన ఆహార్యంతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటోంది. కప్పుకు పది రూపాయల చొప్పను రోజుకు 300 కప్పులకు పైగా చాయ్‌లు అమ్ముతున్నారు. మార్నింగ్ ఆరు గంటలకు షాపు తెరుస్తుంది.. రాత్రి ఏడు గంటలకు క్లోజ్ చేస్తుంది. అందరూ పని గట్టుకుని ఇక్కడికి రావడానికి కారణమేమిటంటే సిమ్రన్ చేసే ఛాయ్ రుచికరంగా ఉంటుంది కాబట్టి. వాళ్ళ ఇంట్లో తయారు చేసిన స్పెషల్ మసాలా టీ పొడినే వాడుతుంది సిమ్రన్. 'ఇంట్లో మా అమ్మ సహకారంతో నేను ప్రత్యేకంగా తయారుచేసిన టీ మసాలా పొడి తోనే ఛాయ్ తయారు చేస్తా.. పాలు, గులాబీ రేకులు, యాలకులు, టీ మసాలా పొడి.. వీటన్నింటినీ మరిగించి సిద్ధం చేసిన టీ ఎంతో రుచిగా ఉంటుంది.. అలాగే ఆరోగ్యానికీ మంచిది. ఈ టీ నచ్చడంతో చాలా మంది ఇక్కడికి వస్తున్నీరు' అని సిమ్రన్ చెప్పుకొచ్చింది. అన్నట్టు టీ షాపుతో మంచి ఆదాయాన్ని సంపాదించుకుంటున్న అమ్మాయిలు ఇంకా ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ’ ప్రియాంక గుప్తా, ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్‌వాలీ’ టుక్‌టుకీ దాస్, ‘బీటెక్ ఛాయ్‌వాలీ’ వర్తికా సింగ్, ‘పీజీ ఛాయ్‌వాలీ’ రాధా యాదవ్, ‘నర్సింగ్ ఛాయ్‌వాలీ’ ప్రీతీ ఝా, ‘బీటీసీ ఛాయ్‌వాలీ’ సృష్టి వర్మ.. తదితరులు కూడా తాము పొందిన సర్టిఫికెట్ల పేరు తోనే టీ స్టాల్స్ వ్యాపారం ప్రారంభించి లక్షల రూపాయలు సంపాదిస్తూ వార్తల్లో నిలిచారు.