ఫోర్బ్స్ అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు.? దీనికి సమాధానం అందరికీ తెలుసు.. ఎలోన్ మస్క్. మస్క్ మొత్తం ఆస్తులు $268 బిలియన్లు. అయితే.. ఈ ఫోర్బ్స్ జాబితాలో రతన్ టాటా పేరు ఎప్పుడూ ఎందుకు కనిపించలేదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.

Why is legendary businessman Ratan Tata not in the list of the world’s richest people
ఫోర్బ్స్(Forbes) అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు.? దీనికి సమాధానం అందరికీ తెలుసు.. ఎలోన్ మస్క్(Elon Musk). మస్క్ మొత్తం ఆస్తులు $268 బిలియన్లు. అయితే.. ఈ ఫోర్బ్స్ జాబితాలో రతన్ టాటా(Ratan Tata) పేరు ఎప్పుడూ ఎందుకు కనిపించలేదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా.. నిస్సందేహంగా మన దేశంలోని అత్యంత ప్రజాదరణ, ఉదార వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులలో ఒకరు. ఆయన సింప్లిసిటీ ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.
అత్యంత సంపన్నుల జాబితాలో రతన్ టాటా పేరు ఎందుకు లేదు?
ఐఐఎఫ్ఎల్ వెల్త్(IIFL Wealth) ప్రకారం.. హురున్ ఇండియా రిచ్ లిస్ట్(Hurun India Rich List) 2021 ప్రకారం.. భారతదేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్ టాటా కంటే.. 432 మంది భారతీయులు ధనవంతులు ముందున్నారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా భారతదేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిన వ్యక్తి ఆ స్థానంలో ఉన్నారంటే నమ్మడం కష్టమే. ఆయన టాప్ 10 లేదా 20 మంది సంపన్న భారతీయులలో ఎందుకు లేడంటే? అందుకు టాటా ట్రస్ట్ స్వచ్ఛంద సేవా కార్యక్రమా(Tata Trust Charitable Service Programmes)లే ఇందుకు కారణంగా చెబుతారు. 2021 నాటికి US$ 103 బిలియన్ల ఆదాయంతో.. టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద వ్యాపార సమ్మేళనాలలో ఒకటిగా నిలిచింది.
కుటుంబం, కంపెనీ వాటాలో 66% స్వచ్ఛంద సంస్థలకే..
టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్‌లు 66 శాతం ఈక్విటీని కలిగి ఉన్నారు. డివిడెండ్‌లు నేరుగా ట్రస్ట్ స్వచ్ఛంద కార్యక్రమాలకు ఇవ్వబడతాయి. గత ఒకటిన్నర శతాబ్దాలుగా.. టాటా గ్రూప్ భారతదేశంలో అత్యంత కీలకమైన భూమికను పోషిస్తుంది. టాటా గ్రూప్ అధిక ఛారిటీ వర్క్(Tata Trust Charitable Work) కారణంగా.. కంపెనీ ఆర్జించే లాభం రతన్ టాటా వ్యక్తిగత ఆర్థిక నివేదికపై ప్రభావం చూపదు. రతన్ టాటా, ఆయన కుటుంబం కంపెనీ ప్రారంభం నుండే దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆరోగ్య సౌకర్యాలు, విద్యావ్యవస్థ మెరుగుదల వంటి కార్యక్రమాల ద్వారా దేశ అభివృద్ధిలో వీరు పాలుపంచుకుంటున్నారు.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని కంపెనీలు
టాటా గ్రూప్ లోహాలు, ఖనిజాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిటైల్, ఆటో కెమికల్స్, రవాణాతో పాటు మరెన్నో విభాగాలలో వీరి వ్యాపార సామ్రాజ్యం విస్తరించివుంది. ఇందులో 29 లిస్టెడ్ కంపెనీలు, కొన్న అన్‌లిస్టెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇన్ని వ్యాపారాలు చేస్తున్న టాటాలు తమ కంపెనీలో ఎక్కువ షేర్లను కలిగి ఉండరు. ఎందుకంటే జంషెడ్‌జీ టాటా స్వయంగా టాటా సన్స్‌లో సంపాదించిన దానిలో ఎక్కువ భాగాన్ని.. టాటా ట్రస్ట్‌లకు విరాళంగా ఇచ్చేలా వారి రాజ్యాంగాన్ని రూపొందించారు. అయితే.. చాలా కాలం వరకూ టాటాలు దాతృత్వంలో అగ్రగామిగా ఉండగా.. ఆ తర్వాత కాలంలో బిల్ గేట్స్(Billgates) వారిని అధిగమించారు. రతన్ టాటా ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కాకపోవచ్చు.. కానీ ఆయన ఓ గొప్ప వ్యక్తి.. దాతృత్వంలో హృదయాలను గెలిచిన విజేత. అందుకే ఆయన ఫోర్బ్స్ జాబితాలో ఉండరు.
