రూ.2000 నోట్లను బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు లేదా నోట్లను మార్చుకునేందుకు ఈరోజే చివరి రోజు. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ..

రూ.2000 నోట్లను బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు లేదా నోట్లను మార్చుకునేందుకు ఈరోజే చివరి రోజు. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం అనంతరం గవర్నర్ శక్తికాంత దాస్(Shakthikantha Das) మాట్లాడుతూ.. రూ.12 వేల కోట్ల కంటే ఎక్కువ విలువైన రూ.2000 నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది మే 19న రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. గత వారంలోనే ఆర్‌బీఐ(RBI) రూ.2000 నోట్లను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్(Deposite) చేయడానికి.. మార్చుకోవడానికి గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది.

ఇప్పటివరకు తిరిగి వచ్చిన మొత్తం నోట్లలో 87 శాతం నోట్లు బ్యాంకు ఖాతా(Bank Accounts)ల్లో జమ అయ్యాయని.. మిగిలిన నోట్లను వివిధ కౌంటర్ల ద్వారా మార్చుకున్నామని ఆర్‌బీఐ గవర్నర్(RBI Governor) తెలిపారు. ఇప్పటి వరకు రూ.3.43 లక్షల కోట్లకు పైగా విలువైన నోట్లు తిరిగి వచ్చాయని వెల్ల‌డించారు. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఆర్‌బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని గవర్నర్ తెలిపారు. ఈ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20,000 నోట్లు (10- రూ. 2,000 నోట్లు) మాత్రమే మార్చుకోవ‌చ్చు. ఈ కార్యాలయాల నుండి దూరంగా ఉన్న వ్యక్తులు.. తమ నోట్లను పోస్ట్ ద్వారా RBI కార్యాలయానికి పంపడం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాకు న‌గ‌దు బదిలీ చేసే సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.

Updated On 6 Oct 2023 10:10 PM GMT
Yagnik

Yagnik

Next Story